గుజరాత్ తీరం వద్ద అరేబియన్ సముద్రంలో ఓ జాలర్ల పడవకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఏడుగురు జాలర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం రక్షించింది.
![Coast Guard ship](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13569204_1.jpg)
గుజరాత్ తీరానికి సుమారు 50మైళ్ల దూరంలో జాలర్లు చేపల వేటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. అంతర్జాతీయ జలాల సరిహద్దుల్లో ఉండగా.. ఇంజిన్లో నుంచి ఇంధనం లీక్ అవడం వల్ల తొలుత పడవ మునగడం మొదలుపెట్టింది. తర్వాత పడవకు మంటలు అంటుకున్నాయి.
![Coast Guard ship](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13569204_3.jpg)
మంటల్లో పడవ పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తోంది. జాలర్లను గుజరాత్లోని ఓఖాకు తరలించినట్టు కోస్ట్ గార్డ్ దళం వెల్లడించింది.
![Coast Guard ship](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13569204_2.jpg)
ఇదీ చూడండి:- సముద్రంలో పాక్ కాల్పులు- భారతీయ జాలరి మృతి