ETV Bharat / bharat

సరిహద్దులో తోకముడిచిన చైనా- కారణమేంటి?

author img

By

Published : Feb 20, 2021, 10:56 AM IST

భారత్​కు తలొగ్గి సరిహద్దులో తోకముడిచిన చైనా తీరుపై ఇప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాంగాంగ్ నుంచి వెనక్కి వెళ్లడం, మృతుల వివరాలను ప్రకటించడం వెనక కారణాలపై అనేక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు చైనా ఉద్దేశం ఏంటి, అంతర్జాతీయ సమాజానికి దీన్నుంచి ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందనే విషయాలు 'ఈటీవీ భారత్'​కు వివరించారు నిపుణులు.

China wants to stir up patriotism and nationalism: Expert
సరిహద్దులో వెనక్కి తగ్గడంపై చైనా ఉద్దేశమదే!

తూర్పు లద్దాఖ్​లో ప్రతిష్టంభనను తొలగించే దిశగా ముందడుగు అయితే పడింది. కానీ మన దేశ భూభాగంలోకి చొచ్చుకొచ్చి, తిరిగి వెళ్లేందుకు మొండికేసిన చైనా.. అకస్మాత్తుగా బలగాల ఉపసంహరణ చేపడుతున్నట్లు ప్రకటించడం, గల్వాన్​ ఘర్షణలో తమ సైనికులు మరణించారని అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. అయితే ఇవన్నీ చైనా ఎత్తులేనని నిపుణులు చెబుతున్నారు. తమ పౌరుల్లో దేశభక్తి, జాతీయవాద భావనను పెంచడానికి మృతుల విషయాన్ని అంగీకరించిందని అంటున్నారు.

ఇదీ చదవండి: భారత్ 'మాస్టర్ స్ట్రోక్​' వల్లే తోకముడిచిన డ్రాగన్!

ఈ విషయంపై జేఎన్​యూ చైనా స్టడీస్ విభాగ ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి 'ఈటీవీ భారత్​'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మృతుల గురించి చైనా చేసిన ప్రకటన ఆశ్చర్యకరమని ఆయన పేర్కొన్నారు. నలుగురు మృతి చెందినట్లు ప్రకటించగా.. అందులో ఒకరి(చెన్ షియాంగ్రోంగ్) సమాధి గతేడాది వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. 45 మంది చైనా సైనికులు మృతి చెందారన్న రష్యా నిఘా సంస్థ నివేదికను ప్రస్తావించారు.

"ఈ అంశాలన్నీ చూస్తే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పాంగాంగ్ సమీపంలోని ఫింగర్ 8-ఫింగర్ 4 మధ్య భూభాగాన్ని ఖాళీ చేయడం వెనక వేరే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. నలుగురు జవాన్ల ప్రాణత్యాగం భవిష్యత్తులో వృథా కానివ్వమని తమ ప్రజలకు హామీ ఇవ్వాలనుకుంటోంది. రెండో విషయం.. ఈ(సైనికుల మృతికి సంబంధించిన) సమాచారాన్ని బహిర్గతం చేసి ప్రజల్లో దేశ భక్తి, జాతీయవాద భావనను పెంచాలనుకుంటోంది. మూడోది.. భారతదేశ శక్తిసామర్థ్యాలను పరిగణలో ఉంచుకొని వాస్తవాధీన రేఖ వెంబడి మరోసారి దుస్సాహసాలకు పాల్పడబోమని సంకేతాలు ఇస్తోంది."

-ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి

అంతర్జాతీయ సమాజాన్ని మభ్యపెట్టేందుకు చైనా ఎత్తుగడలు వేస్తోందని చెప్పారు కొండపల్లి. పాంగాంగ్ సో నుంచి వైదొలగడం ద్వారా బాధ్యతాయుతమైన దేశంగా తనను తాను చిత్రీకరించుకుంటోందని అన్నారు. ఈ ప్రాంతాన్ని తొలుత చైనానే ఆక్రమించినప్పటికీ.. ఇప్పుడు ఖాళీ చేయడం ద్వారా తనపై సానుకూల భావన పెంచుకోవాలని భావిస్తోందని చెప్పారు.

ఇదీ చదవండి: 'ఆ రోజు చైనాతో యుద్ధం జరిగేదే'

ఆసియాలోని రెండు అతిపెద్ద శక్తుల మధ్య పది నెలలుగా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్-మే నుంచి సైన్యం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూ వస్తోంది. గతేడాది జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణ.. ఇరుదేశాల మధ్య పరిస్థితిని మరింత దిగజార్చింది.

ఉద్రిక్తతలు తగ్గించి, బలగాల ఉపసంహరణ చేపట్టేందుకు ఇరుదేశాలు సైనిక, దౌత్య మార్గాల్లో అనేక విడతలుగా చర్చలు జరిపాయి. తొమ్మిదో దఫా సైనిక చర్చల్లో ఈ మేరకు ముందడుగు పడింది. ఉభయపక్షాల అంగీకారం ప్రకారం పాంగాంగ్ సో వద్ద బలగాల ఉపసంహరణ పూర్తైంది. మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రతిష్టంభ తొలగించేందుకు శనివారం చర్చలు జరగనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.