Chhattisgarh Election 2023 Counting : ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం జరగనున్న ఓట్ల లెక్కంపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 7న నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 20 స్థానాలకు తొలి విడతలో, మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న రెండో విడతలో పోలింగ్ జరిగింది.
ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కవర్ధాలో అత్యధికంగా 30 రౌండ్లలో మనేంద్రగఢ్‌లో అత్యల్పంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుందని అధికారులు వెల్లడించారు.
-
Visuals of security arrangements at a counting centre in Raipur.#ChhattisgarhElections2023 #AssemblyElectionsWithPTI
— Press Trust of India (@PTI_News) December 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Full video is available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/ygLzrmryuF
">Visuals of security arrangements at a counting centre in Raipur.#ChhattisgarhElections2023 #AssemblyElectionsWithPTI
— Press Trust of India (@PTI_News) December 2, 2023
(Full video is available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/ygLzrmryuFVisuals of security arrangements at a counting centre in Raipur.#ChhattisgarhElections2023 #AssemblyElectionsWithPTI
— Press Trust of India (@PTI_News) December 2, 2023
(Full video is available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/ygLzrmryuF
ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రధానాధికారి రీనా బాబా సాహెబ్ తెలిపారు. ఓటింగ్ కేంద్రం వద్దకు ఇతరులు ఎవరూ రాకుండా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెద్దఎత్తున కేంద్ర బలగాలను మోహరించారు.
90 శాసనసభ స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా హస్తం పార్టీకే అధికారమని అంచనాలు ప్రకటించాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 68, బీజేపీ 15 స్థానాల్లో విజయం సాధించాయి. 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ పాలనకు 2018లో కాంగ్రెస్ తెరదించింది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 ఉండగా మోజార్టీ మార్కు 46 వచ్చిన పార్టీ అధికారం చేపట్టనుంది.
రెండు విడతల్లో ఎన్నికలు..
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా తొలి విడతలో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ నిర్వహించారు. మిగతా 70 నియోజకవర్గాలకు నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించారు. తొలి విడతలో నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగ్గా 70.87 శాతం పొలింగ్ నమోదైంది. రెండో విడతలో 70.59 శాతం ఓటింగ్ నమోదైంది.