ETV Bharat / bharat

సుశాంత్ పేరుతో మోసం.. ఏడాది పాటు ఫ్రీగా హోటల్​లో.. నకిలీ చెక్​తో బురిడీ

దివంగత నటుడు సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​పై సినిమా తీస్తామంటూ ఓ హోటల్​ యజమానిని బురిడీ కొట్టించారు కొందరు వ్యక్తులు. హోటల్​లోనే సంవత్సరంపాటు ఎలాంటి అద్దె కట్టకుండా విడిది చేశారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.

noida fraud news
cheating case sushant singh rajput
author img

By

Published : Jun 6, 2022, 10:57 AM IST

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​పై సినిమా పేరిట ఓ హోటల్​ యజమానికి టోకరా కొట్టారు కొందరు వ్యక్తులు. దేశ రాజధాని దిల్లీ సమీపంలోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. రూ.8లక్షలు మోసపోయానంటూ బాధితుడు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదైంది.

ఇదీ జరిగింది: నిందితులు విజయ్ శేఖర్, నితిన్ పంత్, సచిన్ తివారీ, వరుణ్ ఖండేల్వాల్.. నోయిడా థానా సెక్టార్​-39లోని ఓ హోటల్​లో నాలుగు గదులు బుక్ చేసుకున్నారు. హోటల్ నిర్వాహకులతో.. తమను తాము డైరెక్టర్లుగా పరిచయం చేసుకున్నారు. సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​పై సినిమా తీస్తామంటూ చెప్పుకున్నారు. సుశాంత్​ పాత్రను తాను పోషించనున్నట్లు సచిన్ తివారీ.. హోటల్​ యజమానికి చెప్పాడు.

2020లో వారు హోటల్​కు వచ్చారని.. నాటి నుంచి ఏడాది పాటు అద్దె కట్టకుండానే విడిది చేశారని బాధితుడు ఆరోపించాడు. చివరకు వారి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్​ అయ్యిందని కోర్టును ఆశ్రయించాడు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి: మన జాతీయ గీతానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.