ETV Bharat / bharat

Chandrababu Bail Petition Hearing: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ - Chandrababu Bail Petition

Chandrababu Bail Petition Hearing: స్కిల్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగే అవకాశం ఉంది. రిమాండు గడువు, రెండు రోజుల కస్టడీ ఆదేశాలు ఆదివారంతో ముగియడంతో.. చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఎదుట హాజరుపరిచారు. రిమాండ్‌ను అక్టోబర్‌ 5 వరకు పొడిగించిన న్యాయాధికారి.. బెయిల్‌ పిటిషన్‌ నేడు విచారణకు వస్తుందని తెలిపారు.

Chandrababu Bail Petition Hearing
Chandrababu Bail Petition Hearing
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 7:11 AM IST

Chandrababu Bail Petition Hearing: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

Chandrababu Bail Petition Hearing: రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఎదుట ఆదివారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాల సమయంలో హాజరుపరచారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో న్యాయాధికారి మాట్లాడారు. మీపై ప్రస్తుతం వచ్చినవి అభియోగాలు మాత్రమేనన్నారు. దర్యాప్తు చేశాక నిజమా.. కాదా అనేది తేలుతుందన్నారు.

సీఐడీ కస్టడీలో మొదటిరోజు విచారణ ఆలస్యంగా ప్రారంభమైందని తెలిసిందన్న ఆమె.. నిజమేనా అని ప్రశ్నించారు. మీ న్యాయవాది మీకు కనిపించేంత దగ్గర్లో ఉండేందుకు అనుమతిచ్చామన్న న్యాయాధికారి.. ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలన్నామని గుర్తు చేశారు. ఈ సౌకర్యాలన్నీ కల్పించారా? థర్డ్‌డిగ్రీ ప్రయోగించి ఏమైనా ఇబ్బంది పెట్టారా? వైద్యపరీక్షలు నిర్వహించాలని చెప్పాము.. కోర్టు ఆదేశాల మేరకు సౌకర్యాలు కల్పించారా?’’ అని ఆరా తీశారు.

CBN CID Custody ముగిసిన సీఐడీ కస్టడీ... అక్టోబర్ 5 వరకు చంద్రబాబుకు రిమాండ్

భౌతికంగా ఏమీ ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు బదులిచ్చారు. ‘‘దర్యాప్తునకు పూర్తిగా సహకరించానన్న చంద్రబాబు.. ఏ తప్పూ చేయలేదు.. ఈ కేసుతో నాకు సంబంధం లేదన్నారు. కావాలనే ఇరికించారన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు క్యాబినెట్‌ నిర్ణయమన్న చంద్రబాబు.. దానికి తననెలా బాధ్యుడ్ని చేస్తారని ప్రశ్నించారు. సీఐడీ సమర్పించిన దస్త్రాలను పరిశీలించాలని ఆయన న్యాయాధికారిని కోరారు.

స్పందించిన న్యాయాధికారి ‘‘దర్యాప్తు అనేది ఓ ప్రొసీజర్‌ మాత్రమేనన్నారు. ప్రస్తుతం మీరు జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్నారన్న ఆమె.. మీపైన వచ్చినవి ఆరోపణలు మాత్రమేనన్నారు. తప్పుచేశానని అనుకోవద్దన్న న్యాయాధికారి.. సోమవారం మీ బెయిల్‌ పిటిషన్‌ విచారణకు వస్తుందన్నారు. ఈ దశలో మీరు తప్పుచేశారనే ప్రస్తావన ఉండదన్నారు. ఇప్పటికిప్పుడు నిజనిర్ధారణ జరగదన్న ఆమె.. పూర్తిస్థాయిలో విచారణ చేశాక గానీ తప్పుచేశారా.. లేదా అనేది తేలదన్నారు. అందుకు కోర్టుకు కొంత సమయం పడుతుందన్న ఆమె.. ఇదివరకే చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నా.. ఈ దశలో మీరు తప్పుచేసినట్లు కాదు’’ అని వ్యాఖ్యానించారు.

Chandrababu Filed Petition in Supreme Court: హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్

కేసులో (Skill Development Case) పూర్తి దస్త్రాలను సీఐడీ తనకు ఇవ్వట్లేదని చంద్రబాబు కోర్టుకు చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయాధికారి.. ‘రిమాండు రిపోర్టుతో పాటు సీఐడీ పోలీసులు కోర్టులో 600 పేజీలను వేశారని అన్నారు. మీ న్యాయవాదిని అడిగి తీసుకొని పరిశీలించండి అని చంద్రబాబుకు చెప్పిన ఆమె.. అప్పుడు కేసు పరిస్థితి మీకు అర్థమవుతుందన్నారు. దస్త్రాలను మీకు అందజేయాలని న్యాయవాదులకు చెబుతాను’ అని పేర్కొన్నారు.

దర్యాప్తు అధికారులకు విశిష్టాధికారాలు ఉంటాయని చంద్రబాబుతో న్యాయాధికారి అన్నారు. కొన్ని వివరాలు గోప్యంగా ఉంచుతారని చెప్పారు. దర్యాప్తులో ఏం తేలిందో చెప్పాలని ఈ దశలో సీఐడీని అడగలేమని తెలిపారు. మీ హక్కులకు.. దర్యాప్తు సంస్థ విశిష్టాధికారానికి.. రెండింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని అన్నారు.

Chandrababu Expressed his Anguish Before Judge: "ఏ తప్పు చేయకపోయినా అరెస్టు చేశారు.. జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు"

చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు.. జ్యుడిషియల్‌ రిమాండును పొడిగించొద్దని కోరారు. సీఐడీ దాఖలుచేసిన మెమోలో సరైన కారణాలు లేవన్నారు. దీనిపై న్యాయాధికారి స్పందిస్తూ.. సవరించిన మెమో వేయాలంటూ సీఐడీకి సూచించారు. కొద్దిసేపటి తర్వాత విచారణ చేసి.. సీఐడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని జ్యుడిషియల్‌ రిమాండును అక్టోబరు 5వ తేదీ వరకు పొడిగించారు.

ఇరువైపుల న్యాయవాదులు ప్రతి చిన్న విషయానికీ బహుళ పిటిషన్లు దాఖలు చేస్తున్నారన్న న్యాయాధికారి.. విచారణ సాఫీగా జరిగేందుకు సహకరించాలని కోరారు. కేసు డెయిరీ, సాక్షుల వాంగ్మూలాలు, తదితర అంశాలను పరిశీలించాకే తాను రిమాండుకు ఆదేశించానని.. యాంత్రికంగా ఉత్తర్వులివ్వలేదన్నారు.

CID filed PT warrant against Chandrababu: చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.