Chandrababu Anticipatory Bail Petition in AP High Court on Sand Policy Case: ఉచిత ఇసుక పథకంపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై కేసు నమోదు చేయటం సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న ఇసుక పాలసీ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లిందని ఏపీఎండీసీ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ హయాంలో ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ.. ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ.. వెంకటరెడ్డి తన ఫిర్యాదులో వెల్లడించారు. బుధవారం హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతులపై వాదనలు పూర్తి, తీర్పు రేపటికి వాయిదా
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు: అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ కేసులో సీఐడీ అధికారులు గతంలో ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. పీటీ వారెంట్‌పై దిగువ కోర్టులో విచారణ తాత్కాలికంగా నిలిపివేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై ఉత్తర్వులు పెండింగ్‌లో ఉన్నాయని.. 17 ఏ రింగ్ రోడ్ కేసుకు కూడా వర్తిస్తుందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
రేపు చంద్రబాబు కంటికి ఆపరేషన్ - ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
అసలేం జరిగిందంటే: రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏపీ సీఐడీకి అందిన ఫిర్యాదు ఆధారంగా.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ రాజధాని నగరానికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును మొదటి నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే.
మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తాం: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఇప్పటికే (Chandrababu) మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. 4 వారాల పాటు చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్య కారణాలరీత్యా... చికిత్స కోసం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నందున ఆ గడువు వరకు ఆయన్ను అరెస్ట్ చేయబోమని అడ్వకేట్ జనరల్ (ఏజీ) కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. తొందరపాటు చర్యలేమీ తీసుకునే ఉద్దేశం లేదని ఏజీ తెలిపారు.
కోర్టు ఆర్డర్లను చంద్రబాబు ఎక్కడా అతిక్రమించలేదు: న్యాయవాది లక్ష్మీనారాయణ