ETV Bharat / bharat

'నైట్​ కర్ఫ్యూ పెట్టండి'.. రాష్ట్రాలకు కేంద్రం సూచన! - రాష్ట్రాలకు కేంద్ర సూచనలు

Centre warns states: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానికంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

Omicron
ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు
author img

By

Published : Dec 23, 2021, 5:00 PM IST

Centre warns states: దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపారు. ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని అన్నారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని సూచనలు ఇవే..

  • పండగల వేళ ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టేలా రాత్రి కర్ఫ్యూలను అమలు చేయాలి.
  • భారీ సభలు, సమూహాలను నియంత్రించాలి.
  • పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా పరిగణించి, అక్కడ తగిన నిబంధనలు అమలు చేయాలి.
  • బాధితుల నమూనాలను ఆలస్యం చేయకుండా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి.
  • జిల్లాల్లో డెల్టా, ఒమిక్రాన్‌ కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పాజిటివిటీ రేటు, డబ్లింగ్‌ రేటు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టిపెట్టాలి.
  • ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, అంబులెన్స్‌, ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలి.
  • రాష్ట్రంలో వైరస్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలి.
  • వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని, జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్‌ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి.
  • రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు 100 శాతం టీకా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.

దేశంలో ఒమిక్రాన్​ వేగంగా వ్యాపిస్తోంది. పాజిటివ్​ కేసుల సంఖ్య 300 దాటింది. తమిళనాడులో గురువారం ఒక్కరోజే 33, కర్ణాటకలో 12 మందికి కొత్త వేరియంట్​ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చూడండి: దేశంలో ఒమిక్రాన్ కలవరం- 9ఏళ్ల బాలికకు పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.