ETV Bharat / bharat

యువతిని ఢీకొట్టి దూసుకెళ్లిన కారు.. వీధి కుక్కలకు ఆహారం అందిస్తుండగా.. - ఛండీగఢ్​ లేటెస్ట్ న్యూస్

వీధికుక్కలకు ఆహారం అందిస్తున్న ఓ యువతిని.. వేగంగా వచ్చిన ఓ కారును ఢీ కొట్టింది. అనంతరం ఆమెను పట్టించుకోకుండా దూసుకెళ్లింది. ఈ ఘటన ఛండీగఢ్​లో జరిగింది.

Chandigarh woman feeding dogs hit by car

author img

By

Published : Jan 16, 2023, 8:05 PM IST

యువతిని ఢీకొట్టిన కారు

ఛండీగఢ్​లో దారుణం జరిగింది. వీధికుక్కలకు ఆహారం అందిస్తున్న ఓ యువతిని.. వేగంగా వచ్చిన ఓ కారును ఢీ కొట్టింది. అనంతరం ఆమెను పట్టించుకోకుండా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం.. నిలకడగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన శనివారం రాత్రి జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సెక్టార్​ 53కు చెందిన 25 ఏళ్ల తేజశ్విత.. వీధి కుక్కలకు ఆహారం అందిస్తోంది. ఆమె తల్లి మంజిందర్​ సైతం తేజశ్వితకు సాయం చేస్తోంది. ఎప్పటిలాగే శనివారం కూడా వీధి శునకాలకు ఆహారం అందించేందుకు తల్లికూతుర్లు కలిసి వెళ్లారు. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన ఓ కారు కుక్కలకు ఆహారం పెడుతున్న తేజశ్వితను ఢీ కొట్టి దూసుకెళ్లింది. దీనిని గమనించిన తల్లి.. వాహనదారులను సహాయం కోరింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదని బాధితురాలి తల్లి వాపోయింది.

అనంతరం పోలీసులు, భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తేజశ్వితను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి తేజశ్విత ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ పోలీసులు ఇప్పటికీ నిందితుడు గుర్తించలేదని ఆరోపించారు.

నూతన సంవత్సరం రోజున దిల్లీ సుల్తాన్‌పురిలో ఇదే తరహా ఘటన జరిగింది. 20 ఏళ్ల యువతిని ఢీకొట్టిన కారు ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. కిలోమీటర్ల మేర యువతిని కారు ఈడ్చుకెళ్లడం వల్ల ఆమె శరీరం ఛిద్రమైంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.