ETV Bharat / bharat

ఉపఎన్నికల్లో సత్తా చాటిన భాజపా.. పట్టు నిలుపుకున్న ఆర్జేడీ, శివసేన - అధమ్​పుర్ ఉపఎన్నిక ఫలితం

Bypoll results : దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. భాజపా నాలుగు స్థానాల్లో విజయం సాధించగా.. ఆర్జేడీ, శివసేన(ఉద్ధవ్ వర్గం) చెరొక స్థానాన్ని గెలుచుకున్నాయి.

bypoll results
ఉపఎన్నిక ఫలితాలు
author img

By

Published : Nov 6, 2022, 3:06 PM IST

Updated : Nov 6, 2022, 6:02 PM IST

Bypoll results : దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా చూసిన ఉపఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో భాజపా నాలుగు స్థానాలు గెలుచుకుంది. ఆర్జేడీ, శివసేన(ఉద్ధవ్ వర్గం) చెరొక స్థానంలో విజయకేతనం ఎగురవేశాయి.
ఉత్తర్​ప్రదేశ్​..
ఉత్తర్​ప్రదేశ్​లోని గోల గోఖర్​నాథ్ శాసనసభ సీటుకు జరిగిన ఉపఎన్నికలో అధికార భాజపా పట్టు నిలుపుకుంది. సమాజ్​వాదీ పార్టీ అభ్యర్థి వినయ్ తివారీపై భాజపా అభ్యర్థి అమన్​గిరి 34,298 ఓట్ల తేడాతో గెలుపొందారు. భాజపా అభ్యర్థి అమన్​గిరి 1,24,810 ఓట్లు సాధించగా.. ఎస్పీ అభ్యర్థి వినయ్​ తివారీకి 90,512 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో గోల గోఖర్​నాథ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అరవింద్ గిరి స్థానంలో ఆయన కుమారుడు అమన్​గిరిని భాజపా బరిలో దింపింది.

హరియాణా..
హరియాణాలోని అధంపుర్​ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి భవ్య బిష్ణోయ్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్​పై 15,714 ఓట్ల తేడాతో భవ్య బిష్ణోయ్ విజయ కేతనం ఎగురవేశారు. అంతకుముందు అధంపుర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్.. కాంగ్రెస్​కు రాజీనామా చేసి భాజపాలో చేరడం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది. కుల్దీప్ స్థానంలో ఆయన కుమారుడు భవ్య బిష్ణోయ్​ను అధికార భాజపా బరిలో దింపి విజయం సాధించింది.

మహారాష్ట్ర..
మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్​కు జరిగిన ఉపఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి రుతుజా లట్కే విజయకేతనం ఎగురవేశారు. ఈ ఏడాది మేలో శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఆయన భార్య రుతుజా లట్కే శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) తరపున బరిలో దిగారు. ఆమెకు 66,247 ఓట్లు రాగా.. ఆ తర్వాత స్థానంలో ఉన్న నోటాకు 12,776 ఓట్లు రావడం విశేషం.

భాజపా అభ్యర్థి ఈ ఎన్నికలో నామినేషన్​ను ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలేవీ బరిలో లేకపోవడం వల్ల శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. మహా వికాస్ అఘాడీ కూటమిలోని భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ.. శివసేన అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి.

బిహార్​..
బిహార్​లోని జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఆర్జేడీ చెరొక స్థానంలో గెలుపొందాయి. గోపాల్​గంజ్ నియోజకవర్గంలో భాజపా విజయకేతనం ఎగురవేయగా, మోకామాలో ఆర్జేడీ విజయం సాధించింది. గోపాల్​గంజ్​లో ఆర్జేడీ అభ్యర్థి మోహన్ గుప్తాపై భాజపా అభ్యర్థి కుసుమ్ దేవీ 1,789 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భాజపా అభ్యర్థి కుసుమ్ దేవికి 70,032 ఓట్లు రాగా.. ఆర్జేడీ అభ్యర్థి మోహన్ గుప్తాకు 68,243 ఓట్లు వచ్చాయి.

మోకామో నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవీ.. భాజపా అభ్యర్థి సోనమ్ దేవీపై 16,707 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికలో ఆర్డేడీకు 79,646 ఓట్లు రాగా.. భాజపాకు 62,939 ఓట్లు వచ్చాయి. మోకామో ఎమ్మెల్యే అనంత్ సింగ్ అనంత్ కుమార్​ సింగ్​పై ఓ కేసులో అనర్హత వేటు పడడం వల్ల ఈ ఎన్నికల్లో ఆయన భార్య నీలం దేవీ.. ఆర్జేడీ తరపున బరిలో దిగి విజయం సాధించారు.

ఒడిశా..
ఒడిశాలోని ధామ్​నగర్ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి సూర్యభన్షి సూరజ్ విజయం సాధించారు. అధికార బీజేడీ అభ్యర్థి అభంతి దాస్​పై 9,881 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. సెప్టెంబరులో భాజపా సిట్టింగ్ ఎమ్మెల్యే బిష్ణు చరణ్ సేథీ మరణంతో ధామ్‌నగర్​లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో ఆయన కుమారుడు సూర్యభన్షిను భాజపా బరిలో నిలిపింది.

ఇవీ చదవండి: ఉమ్మడి పౌర స్మృతి అమలు.. అమ్మాయిలకు సైకిళ్లు, స్కూటర్లు, రిజర్వేషన్.. భాజపా హామీల జల్లు

కాంగ్రెస్‌ గడీలపై కమలం కన్ను.. కంచుకోటను కదిలించేనా?

Last Updated : Nov 6, 2022, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.