ETV Bharat / bharat

Buses Fire At Bangalore : గ్యారేజీలో అగ్నిప్రమాదం.. 22 బస్సులు దగ్ధం.. కారణం అదే!

Buses Fire At Bangalore : గ్యారేజీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 22 బస్సులు దగ్ధమయ్యాయి. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిందీ ఘటన.

Buses Fire At Bangalore
Buses Fire At Bangalore
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 1:38 PM IST

Updated : Oct 30, 2023, 6:34 PM IST

Buses Fire At Bangalore : కర్ణాటక.. బెంగళూరులోని ఓ గ్యారేజీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 22 బస్సులు దగ్ధమయ్యాయి. వీరభద్రనగర్​లో ఉన్న గ్యారేజీలో సోమవారం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
SV కోచ్ గ్యారేజీలో కొత్త, పాత బస్సు ఇంజిన్​లకు బాడీ వర్క్ జరుగుతోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి గ్యారేజీలో ఉన్న బస్సులకు వేగంగా వ్యాపించినట్లు సమాచారం. గ్యారేజీలో మొత్తం 35 బస్సులు ఉన్నాయని, అందులో 22 బస్సులకు మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.

అగ్నిప్రమాదం.. అనేక బస్సులు దగ్ధం

'గ్యారేజీలోని బస్సులకు వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్నారు. వెల్డింగ్ మెషీన్ నుంచి ఎగసిపడ్డ నిప్పురవ్వలే మంటలకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తర్వాత మంటలు ఇతర బస్సులకు వ్యాపించాయి. దీంతో గ్యారేజీలోని బస్సులకు భారీ నష్టం వాటిల్లింది.'
-పోలీసు అధికారి

'బహిరంగ ప్రదేశంలో గ్యారేజీ.. తప్పిన ముప్పు'
మంటలు వ్యాపించగానే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. మంటలను పూర్తిగా ఆర్పేశాయి. 18 బస్సులు పూర్తిగా పూర్తిగా కాలిపోయాయని, మరో నాలుగు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. గ్యారేజీ బహిరంగ ప్రదేశంలో ఉండటం వల్ల.. మంటలు చెలరేగగానే.. అంతా దూరంగా వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు.

"మంటలపై సమాచారం అందగానే 10 అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించాం. మంటలను అదుపులోకి తెచ్చాం. గ్యారేజీలో కొత్త బస్సులు లేవు. పాత బస్సులను రిపేర్ చేస్తున్నారు. మంటలు రాగానే 10 బస్సులను గ్యారేజీ నుంచి తరలించాం. ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది."
-గురులింగయ్య, అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్

'విచారణకు ఆదేశిస్తాం'
ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఘటనాస్థలిని సందర్శించిన ఆయన.. దేవుడి దయ వల్ల ప్రాణనష్టం ఏమీ జరగలేదని అన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతాయని పేర్కొన్నారు.

  • #WATCH | Bengaluru: Karnataka Dy CM DK Shivakumar visits fire disaster site in Veerabhadranagar; says, "...By God's grace, no casualty has happened, but still my fire force and police department will investigate in the matter as to what best precautionary measure has to be… pic.twitter.com/htlJNGp79w

    — ANI (@ANI) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Ahmednagar Train Fire : రైలులో భారీ అగ్నిప్రమాదం.. 5 కోచ్​లకు మంటలు.. లక్కీగా..

దిల్లీ ఎయిమ్స్​లో అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులో భారీగా మంటలు!

Last Updated : Oct 30, 2023, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.