జమ్ముకశ్మీర్ సరిహద్దులో మరోసారి డ్రోన్లు కలకలం సృష్టించాయి. జమ్మూలోని అర్నియా సెక్టార్లో శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటలకు.. పాకిస్థాన్ నుంచి భారత సరిహద్దులోకి ఓ డ్రోన్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు.. కాల్పులు జరపగా డ్రోన్ తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని భద్రతా దళ అధికారులు వెల్లడించారు. డ్రోన్ ద్వారా సరిహద్దులో పాకిస్థాన్ రెక్కీ నిర్వహిస్తున్నట్లు భద్రతాదళాలు భావిస్తున్నాయి.
గత నెల 27న జమ్మూలోని వైమానిక స్థావరంపై దాడులు మొదలుకుని ఆ ప్రాంతాల్లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది సైన్యం.
ఇదీ చదవండి : అర్ధరాత్రి డ్రోన్ల కలకలం.. బలగాలు అప్రమత్తం