ETV Bharat / bharat

Brother Murder : సోదరిపై వేధింపులు.. అడ్డుచెప్పిన సోదరుడి హత్య.. రాఖీకి 2రోజుల ముందే - అన్న హత్య సోదరిపై వేధింపులు

Brother Murder Opposing Sister Molestation : సోదరిపై వేధింపులను వ్యతిరేకించినందుకు ఆమె సోదరుడిపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీంతో అతడు మరణించాడు. రాఖీ పండుగకు రెండు రోజుల ముందే ఉత్తర్​ప్రదేశ్​లో ఈ విషాద ఘటన జరిగింది.

Brother murder opposing sister molestation in Prayagraj uttarpradesh

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 9:57 AM IST

Brother Murder Opposing Sister Molestation : అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన రక్షా బంధన్​ పండుగకు రెండు రోజుల ముందు ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​ జిల్లాలో దారుణం జరిగింది. తన సోదరిపై వేధింపులు వ్యతిరేకించినందుకు సోదరుడిని కొందరు కొట్టి చంపారు. బాధితుడిని కిశోర్​గా పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని ఖేరీ పోలీస్​స్టేషన్​ పరిధికి చెందిన కిశోర్​.. తన సోదరితో సోమవారం పాఠశాలకు వెళ్లాడు. అయితే తరగతి గదిలో కిశోర్​ బిగ్గరగా మాట్లాడినందుకు మిగతా విద్యార్థులు.. అతడిపై కోప్పడ్డారు. దీంతో కిశోర్​ వారితో గొడవపడ్డాడు. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలోనూ.. విద్యార్థులతో బాధితుడు మళ్లీ వాగ్వాదానికి దిగాడు.

Sister Molestation Brother Murder : అయితే కిశోర్​ సోదరి.. గొడవను అడ్డుకుంది. ఆ సమయంలో మిగతా విద్యార్థులు.. ఆమెపై వేధింపులకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆరోపించారు. సోదరిపై వేధింపులను కిశోర్ వ్యతిరేకించడం వల్ల.. అతడిపై నిందితులు చెక్క పలకతో దాడి చేశారు. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కిశోర్​ మరణించాడన్న విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆగ్రహానికి లోనయ్యారు. ఖేరీ-కోరాన్ హైవేను దిగ్బంధించి నిరసన ప్రారంభించారు. పోలీసు కమిషనర్ రమిత్ శర్మ ఘటనాస్థలానికి చేరుకుని.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలే ఈ ఘటనకు కారణమని చెప్పారు.

Prayagraj Brother beaten death for opposing molestation with sister, Villagers jammed
జాతీయ రహదారిని నిర్భందించిన గ్రామస్థులు

మహిళపై గ్యాంగ్​ రేప్​.. ఆపై వీడియో తీసి..
Woman Gangarape In UP : ఉత్తర్​ప్రదేశ్​లోని హాథ్రాస్​ జిల్లాలోని ఓ మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చంపేస్తామని బెదిరించారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు వివరాల ప్రకారం.. జిల్లాలోని ముర్సాన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి భర్త ట్రక్కు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. దీంతో ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. ఇదే అదనుగా తీసుకున్న యువకులు.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 26న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బాధితురాలు.. పశువుల కోసం మేత సేకరించేందుకు పొలానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న నలుగురు యువకులు ఆమెను అడ్డుకున్నారు. శబ్దం చేస్తే చంపేస్తానని పిస్టల్​తో బెదిరించారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై ఆమెను నగ్నంగా మార్చి వీడియో తీశారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అసభ్యకరమైన వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. భర్త, కుమారులను కూడా చంపేస్తామని చెప్పారు. దీంతో మహిళ.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ నిందితులు మాత్రం ఆమె అసభ్యకర వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో మహిళ ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.