ETV Bharat / bharat

'లైంగిక సంబంధం తర్వాత పెళ్లికి నిరాకరిస్తే నేరం కాదు' - శారీరీక సంబంధం కేసులో బాంబే హైకోర్టు

High court on sexual relationship: పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుని.. ఆ తర్వాత పెళ్లికి నిరాకరిస్తే నేరం కాదని బాంబే హైకోర్టు తెలిపింది. ఈ కేసులో 25 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది.

bombay high court, High court on sexual relationship
బాంబే హైకోర్టు, లైంగిక సంబంధం కేసులో న్యాయస్థానం
author img

By

Published : Dec 23, 2021, 9:24 PM IST

High court on sexual relationship: పెళ్లి పేరు చెప్పి తనతో లైంగిక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత ముఖం చాటేసిన కేసులో ఓ వ్యక్తికి 25 ఏళ్ల తర్వాత బాంబే హైకోర్టులో ఊరట లభించింది. అతడితో లైంగిక సంబంధం పెట్టుకునేందుకు మహిళ నిరాకరించిందనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున సెక్షన్​ 417 కింద నేరం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అసలేంటీ కేసు..?

Bombay high court: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహారాష్ట్ర పాల్గడ్​కు చెందిన ఓ వ్యక్తి తనతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడని ఆరోపిస్తూ 1996లో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పెళ్లికి అతడు నిరాకరించాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఐపీసీ 376(అత్యాచారం),ఐపీసీ 417(మోసం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

విచారణ సమయంలో బాధిత మహిళ సహా ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులను ప్రాసిక్యూషన్​ విచారించింది. అందులో నిందితుడు తనకు తెలుసని బాధితురాలు అంగీకరించింది. తాను మూడేళ్లపాటు నిందితునితో లైంగిక సంబంధాన్ని కొనసాగించానని చెప్పింది. అంతేగాక వాళ్లిద్దరూ మూడేళ్లపాటు ప్రేమించుకున్నారని బాధితురాలి సోదరి కూడా తెలిపింది. మూడేళ్ల విచారణ తర్వాత.. ఈ కేసులో పాల్గఢ్​ అదనపు న్యాయమూర్తి... నిందితునికి ఏడాది జైలు శిక్ష సహా రూ.5,000 జరిమానా విధించారు.

Misrepresentation of marriage: దీనిపై నిందితుడు బాంబే హైకోర్టులో అప్పీలు చేశాడు. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. వాళ్లిద్దరూ పరస్పర అంగీకారంతోనే లైంగిక సంబంధం పెట్టుకున్నారని సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపింది. లైంగిక సంబంధం పెట్టుకునే సమయంలో మహిళ నిరాకరిస్తేనే మోసం కింద పరిగణిస్తామని జస్టిస్ ప్రభుదేశాయ్​ పేర్కొన్నారు.

"ఈ కేసు మొదటి నుంచీ నిందితునిపై మోసానికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. నిందితుడు ఆ మహిళను పెళ్లి చేసుకోవాలని భావించలేదు. పెళ్లి వాగ్దానంతోనే మహిళ అతడితో శారీరక సంబంధం పెట్టుకుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేనందున.. ఐపీసీ సెక్షన్ 90, 417 ప్రకారం నేరంగా పరిగణించలేం" అని జస్టిస్ ప్రభుదేశాయ్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: దళిత మహిళ వండుతోందని.. భోజనం మానేసిన విద్యార్థులు!

ఇదీ చూడండి: ఆన్​లైన్​లో 'వ్యాక్సిన్' మోసం.. తండ్రిని పోగొట్టుకున్న డాక్టర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.