ETV Bharat / bharat

భాజపా యువనేత దారుణ హత్య.. నిందితుల్ని వదిలిపెట్టబోమని సీఎం ట్వీట్​ - Basavaraj Bommai Karnataka cm

BJP Activist Killed: భాజపా కార్యకర్త దారుణ హత్యకు గురైన సంఘటన దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది. తమ పార్టీ కార్యకర్త హత్యను ఖండించారు సీఎం బసవరాజ్​ బొమ్మై. నిందితుల్ని పట్టుకొని శిక్షిస్తామని అన్నారు.

BJP activist murdered in Dakshina Kannada

author img

By

Published : Jul 27, 2022, 9:01 AM IST

Updated : Jul 27, 2022, 12:41 PM IST

BJP Activist Killed: భాజపా యువ మోర్చా నాయకుడు ప్రవీణ్​(32) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని నెట్టారు ప్రాంతంలో మంగళవారం జరిగింది. దుండగులు మూకుమ్మడిగా దాడి చేయగా.. ప్రవీణ్​కు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. పౌల్ట్రీ షాప్​ యజమాని అయిన ప్రవీణ్​పై మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో దాడి జరిగింది. ఇద్దరు దుండగులు.. పదునైన ఆయుధాలతో భాజపా కార్యకర్తపై విరుచుకుపడ్డారు. హత్యకు గల కారణాలేంటి? హత్య చేసింది ఎవరు? అనేది తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న బెళ్లారె పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.

సీఎం ట్వీట్​.. భాజపా కార్యకర్త హత్యను ఖండించారు కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై. తమ పార్టీ కార్యకర్తను దారుణంగా చంపిన నిందితుల్ని త్వరలోనే పట్టుకొని శిక్షిస్తామని ట్వీట్​ చేశారు. ప్రవీణ్​ ఆత్మకు శాంతి చేకూరాలని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కుటుంబసభ్యులు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు.
ప్రవీణ్​ హత్యపై దక్షిణ కన్నడ జిల్లాలో భాజపా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దక్షిణ కన్నడ జిల్లాలోని సుళ్య, కడబ, పుత్తూర్​ తాలూకాల్లో.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు.. హిందూ సంస్థలు స్థానికంగా బంద్​కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రభుత్వ బస్సులపై కొందరు రాళ్లు విసిరారు.

ఇవీ చూడండి: మద్యం పేరిట రసాయనాల విక్రయం.. 36 మంది మృతి

విద్యార్థిపై ఒకేసారి ముగ్గురు టీచర్ల ప్రతాపం.. దెబ్బలకు తట్టుకోలేక మృతి

Last Updated : Jul 27, 2022, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.