ETV Bharat / bharat

నితీశ్​ రాజీనామా.. ఆర్​జేడీ, కాంగ్రెస్​తో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు! - భాజపా జేడీయూ కూటమి

BIHAR POLITICS LIVE UPDATES JDU RJD MLA MEETINGS

author img

By

Published : Aug 9, 2022, 11:01 AM IST

Updated : Aug 9, 2022, 3:58 PM IST

15:56 August 09

అనుకున్నట్టే జరిగింది. నితీశ్​ కుమార్​ ఎత్తుగడతో బిహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మిత్రపక్షం భాజపాకు రెండోసారి షాక్ ఇచ్చింది జనతాదళ్​ యునైటెడ్​(జేడీయూ). జాతీయ ప్రజాస్వామ్య కూటమి నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ), కాంగ్రెస్​, వామపక్షాలతో కూడిన మహాకూటమితో జట్టు కట్టింది. ఆ పార్టీలతో కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది నితీశ్​ సేన. ఇందుకు అనుగుణంగా.. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు నితీశ్ కుమార్. మంగళవారం పట్నాలో గవర్నర్​ ఫాగూ చౌహాన్​ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. మహాకూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. నితీశ్​కు మద్దతు తెలుపుతూ ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​ ఇచ్చిన లేఖను సమర్పించారు.

కావాలనే చేశారు..!
నితీశ్​ రాజీనామా ప్రకటనకు ముందు.. హైఓల్టేజ్ రాజకీయానికి వేదికైంది బిహార్. ప్రధాన పార్టీలన్నీ విడివిడిగా సమావేశాలు నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించాయి. జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పట్నాలో భేటీ అయ్యారు నితీశ్. "ముందు చిరాగ్ పాసవాన్ తిరుగుబాటు, తర్వాత ఆర్​సీపీ సింగ్ రూపంలో జేడీయూను బలహీనపరిచేందుకు భాజపా ప్రయత్నించింది. కూటమి నుంచి నేను వైదొలగాల్సిన పరిస్థితిని భాజపానే సృష్టించింది" అని పార్టీ నేతలకు నితీశ్​ చెప్పినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. నితీశ్​ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

పదండి చూసుకుందాం..!
అదే సమయంలో.. ఆర్​జేడీ నేతృత్వంలోని మహాకూటమి పార్టీల నేతలు పట్నాలోని రబ్రీ దేవి నివాసంలో సమావేశమయ్యారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని తేజస్వీ యాదవ్​కు అప్పగించారు ఆర్​జేడీ, కాంగ్రెస్​, వామపక్షాల నేతలు. "కొత్త ప్రభుత్వంలో మంత్రుల శాఖల కేటాయింపులో జేడీయూతో ఎలాంటి ఇబ్బందులు లేవు. మనందరికీ కలిపి 160 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సృష్టించేందుకు లేదా రాష్ట్రపతి పాలన విధించేందుకు భాజపా ప్రయత్నిస్తే.. మనం దీటైన జవాబు ఇవ్వొచ్చు" అని ఈ సందర్భంగా తేజస్వీ మహాకూటమి నేతల వద్ద ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు.. లౌకిక శక్తులకు అండగా నిలవాలనే భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్.

ప్రతివ్యూహ రచనలో భాజపా!
ఎన్​డీఏ నుంచి జేడీయూ నిష్క్రమణ వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన భాజపా.. సోమవారం సాయంత్రం నుంచి వరుస భేటీలు నిర్వహించింది. అదే సమయంలో.. 18 మంది ఆర్​జేడీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. 2021 మార్చి 23న అసెంబ్లీలో 'పోలీసు బిల్లు'పై చర్చ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన ఆర్జేడీ సభ్యులపై వేటు వేయడంపై బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ సిన్హా కసరత్తు ప్రారంభించినట్లు వార్తలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వేర్వేరు పార్టీల బలాబలాలపై చర్చ మొదలైంది. బిహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. అతిపెద్ద పార్టీ ఆర్జేడీకి అసెంబ్లీలో 80 స్థానాలు ఉండగా.. భాజపా 77, జేడీయూ 45, కాంగ్రెస్ 19 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ 18 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలపై వేటు పడ్డా.. నితీశ్ కుమార్​కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు.

భాజపాకు రెండు సార్లు ఝలక్​ ఇచ్చిన నితీశ్​
'రాజకీయ పునరేకీకరణ'కు నితీశ్ కారకులు కావడం ఇది రెండోసారి. ఆయన నేపథ్యాన్ని గమనిస్తే రాజకీయంగా ఆయన ఎటువంటి నిర్ణయాన్నైనా తీసుకోగలరని స్పష్టమవుతుంది. మోదీని విమర్శిస్తూ భాజపాతో పొత్తు పెట్టుకోగలిగారు. అనంతరం ఎన్‌డీఏను వీడి ఆర్జేడీతోనూ జట్టుకట్టారు. మళ్లీ ఆర్జేడీని మధ్యలోనే(2017) వదిలేసి కమలనాథుల చెంతకు చేరారు. ఇప్పుడు మళ్లీ భాజపాకు గుడ్​బై చెప్పి.. మహాకూటమితో చేతులు కలిపారు.

13:03 August 09

బిహార్​లో జేడీయూ-ఆర్​జేడీ-కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా చకచకా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్.. సాయంత్రం 4 గంటలకు గవర్నర్​ను కలిసి, రాజీనామా లేఖ అందిస్తారని తెలిసింది.

మరోవైపు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జేడీయూ అధిష్ఠానం పట్నాలో నిర్వహించిన సమావేశం కీలక చర్చలకు వేదికైనట్లు తెలిసింది. "పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ నితీశ్ కుమార్​కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని స్పష్టం చేశారు." అని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. సరికొత్త కూటమికి నేతృత్వం వహించేందుకు సిద్ధమైన నితీశ్​కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు జేడీయూ జాతీయ పార్లమెంటరీ బోర్డ్ అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా.

అదే సమయంలో.. ఆర్​జేడీ నేతలు సైతం ఇలాంటి తీర్మానమే చేశారు. పట్నాలో సమావేశమైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. తాజా రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. నిర్ణయం తీసుకునే అధికారాన్ని తేజస్వీ యాదవ్​కు అప్పగించారు. కాంగ్రెస్, వామపక్షాల నేతలు సైతం.. తేజస్వీకి అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రం సహా సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాల్ని లాలూ నిశితంగా గమనిస్తున్నారని.. అయితే రాజకీయ నిర్ణయాలన్నీ పూర్తి స్థాయిలో తేజస్వీనే తీసుకుంటున్నారని ఆర్​జేడీ వర్గాలు తెలిపాయి.

11:45 August 09

గవర్నర్​ వద్దకు జేడీయూ
బిహార్​లో ప్రభుత్వం మార్పు తథ్యమన్న ఊహాగానాల మధ్య మరో కీలక పరిణామం జరిగింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఫాగూ చౌహాన్ అపాయింట్​మెంట్ కోరింది జేడీయూ.

10:31 August 09

ఎమ్మెల్యేలతో నితీశ్, లాలూ భేటీ.. ఫోన్లు బయటే.. ప్రభుత్వ మార్పు తప్పదా?

బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భాజపా, జేడీయూ మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో మంగళవారం జరుగుతున్న శాసనసభ్యుల భేటీలకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన పట్నాలో జేడీయూ శాసనపక్ష సమావేశం నిర్వహించారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం నితీశ్ నివాసంలో జరుగుతున్న భేటీకి హాజరయ్యారు. మరోవైపు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఆర్జేడీ ఎమ్మెల్యేల భేటీకి వామపక్ష పార్టీలు సైతం హాజరయ్యాయి. లాలూ ఇంట్లో జరుగుతున్న ఈ భేటీకి ఎమ్మెల్యేల ఫోన్లను అనుమతించడం లేదు.

భాజపాకు గుడ్​బై చెప్పేసి.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా నితీశ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్​ను సైతం ప్రభుత్వంలో భాగం చేసుకోవాలని నితీశ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై సోనియా గాంధీతో సీఎం చర్చించారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Last Updated : Aug 9, 2022, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.