ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​ గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబే అరెస్ట్​

vikas-duby-arrest
ఉత్తర్​ప్రదేశ్​ గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబే అరెస్ట్​
author img

By

Published : Jul 9, 2020, 9:48 AM IST

Updated : Jul 9, 2020, 11:23 AM IST

10:11 July 09

వికాస్​ను ఈడ్చుకెళ్తున్న పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పుర్‌ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన సూత్రధారి అరెస్టయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రౌడీ షీటర్​ వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  

ఈ నెల 3న అర్ధరాత్రి కాన్పుర్‌లో అతడిని పట్టుకునేందుకు వచ్చిన పోలీసు బృందంపై వికాస్​ గ్యాంగ్​ కాల్పులు జరిపింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది పోలీసులు అమరులయ్యారు. అప్పటినుంచి పరారీలో ఉన్నాడు వికాస్​. అతని కోసం యూపీ పోలీసు బృందాలు విస్తృతంగా గాలించాయి. ఎట్టకేలకు ఇవాళ ఉదయం చిక్కాడు. 

అలా దొరికాడు..

వికాస్​.. మధ్యప్రదేశ్​ ఉజ్జయినిలోని మహాకాల్​ ఆలయానికి వెళ్తుండగా.. భద్రతా సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన స్థానిక పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం.. తానే వికాస్​ దూబేనని, కాన్పుర్​ వాసినని అంగీకరించాడు. 

వికాస్​ అరెస్టును మధ్యప్రదేశ్ హోం​ మంత్రి నరోత్తమ్​ మిశ్రా ధ్రువీకరించారు. యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. 

దూబే అరెస్టైన విషయాన్ని మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు ఫోన్​లో తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులకు నిందితుడిని అప్పగించనున్నట్లు స్పష్టం చేశారు.  

క్రిమినల్​ కేసులు..

మోస్ట్​ వాంటెడ్​ గ్యాంగ్​స్టర్​ అయిన దూబేపై 60కి పైగా క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ఇతని తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని హత్యలు, బెదిరింపులు సహా అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. వికాస్‌ అరెస్టుతో నేరాల కట్టడిలో యూపీ పోలీసులు భారీ విజయం సాధించారు. 

అంతకుముందు వికాస్ దూబే అనుచరుల్లో మరో ఇద్దరు ఇవాళ ఉదయం ఎన్​కౌంటర్​లో చనిపోయారు. వేర్వేరు ఎన్​కౌంటర్లలో వికాస్​ అనుచరులైన ప్రభాత్ మిశ్రా, బహువా దూబే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి కార్తీకేయ అలియాస్ ప్రభాత్ మిశ్రా పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. ప్రభాత్​తో పాటు మరో ఇద్దరిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కాన్పుర్​ ఎన్​కౌంటర్​ తర్వాత హతమైన వికాస్​ బృంద సభ్యుల సంఖ్య ఐదుకు చేరింది. 

ఇదీ చూడండి: ఎన్​కౌంటర్​లో ఇద్దరు 'దూబే' అనుచరులు హతం

09:44 July 09

ఉత్తర్​ప్రదేశ్​ గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబే అరెస్ట్​

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్​కౌంటర్​ ప్రధాన నిందితుడు, గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబేను మధ్యప్రదేశ్​ ఉజ్జయినిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ​వికాస్ దూబేను అరెస్టును మధ్యప్రదేశ్​ హోంమంత్రి ధ్రువీకరించారు. వారం క్రితం అరెస్ట్​ చేయడానికి వెళ్లిన 8 మంది పోలీసులను వికాస్​ దూబే కాల్చి చంపాడు. ఇప్పటికే వికాస్ దూబే ముగ్గురు అనుచరులు హతమయ్యారు. 

Last Updated : Jul 9, 2020, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.