కరోనా కారణంగా మూసేసిన ఉత్తరాఖండ్ పిథోరాగఢ్లోని అంతర్జాతీయ వంతెనను అధికారులు పది నిమిషాల పాటు తెరిచారు. నేపాల్-భారత్‌ను కలిపే ఈ వంతెనను ఓ నేపాలీ బాలిక అభ్యర్థన మేరకు గురువారం ఉదయం 10.30 గంటలకు తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. భారత్‌లో బీకామ్ పరీక్షలు రాసేందుకు నేపాల్ బాలిక వచ్చినట్లు తెలిపారు. దర్ఛులా జిల్లా సబ్ కలెక్టర్, నేపాల్ అధికారులతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఉత్తరాఖండ్ హల్ద్వానీలోని ఓ ప్రభుత్వ కళాశాలలో యువతి చదువుకుంటోందని వెల్లడించారు సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) ఇన్స్పెక్టర్ కశ్మీరా సింగ్. పది నిమిషాల పాటు ఈ వంతెనను తెరవగా.. భారత్ నుంచి 36 మంది నేపాల్‌కు వెళ్లారని.. 34 మంది నేపాల్ నుంచి భారత్‌కు వచ్చినట్లు చెప్పారు.