దిల్లీలో నిర్బంధ కేంద్రంలోని బాధితుల మూత్రాన్ని సమీపంలోని జనావాస ప్రదేశంలో పడేసిన గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ద్వారకా సెక్టార్ 16లోని ఓ ప్రాంతంలోని పంప్ హౌస్ వద్ద బాధితుల మూత్రం నింపిన బాటిళ్లు ఉన్నాయని నిర్బంధ కేంద్రంలో పనిచేసే ఓ ఉద్యోగి గుర్తించాడు. అనంతరం ఈ అంశమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
"నిర్బంధ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి మా వద్దకు వచ్చాడు. నిర్బంధ కేంద్రంలోని మూత్రం సీసాలు బహిరంగ ప్రదేశంలో ఉన్నట్లు చెప్పాడు. ఈ సీసాలను నిర్బంధ కేంద్రంలోని అనుమానితులే విసిరి ఉంటారని అనుకుంటున్నాం."
-పోలీసుల ఎఫ్ఐఆర్ నివేదిక
ఇలా మూత్రాన్ని పారబోయడం వెనక దురుద్దేశాలు దాగి ఉన్నాయని తమ ఫిర్యాదులో పేర్కొన్నాడు పిటిషనర్.
ఇదీ చూడండి: కరోనా సంక్షోభంలో అసలైన హీరోలు వారే: సుప్రీం