ETV Bharat / bharat

దేశంలో మరింత పెరిగిన కరోనా మృతుల సంఖ్య

దేశాన్ని కరోనా కలవరపెడుతోంది. వైరస్​ బారిన పడి ఇప్పటివరకు 13మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 649మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. మరోవైపు దిల్లీలోని ఓ మొహల్లా క్లినిక్​ వైద్యుడికి వైరస్ సోకినట్టు​ నిర్ధరణ అయ్యింది. ఆ డాక్టర్​ను కలిసిన దాదాపు 800మందిని క్వారంటైన్​ చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు.

Total number of #COVID19 positive cases rise to 649 in India
దేశంలో పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య
author img

By

Published : Mar 26, 2020, 11:20 AM IST

దేశంలో కరోనా వైరస్​ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రాణాంతక మహమ్మారితో ఇప్పటి వరకు 13మంది మరణించారు. కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దేశంలో మొత్తం 649మందికి వైరస్​ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. వీరిలో 42మంది కరోనాను జయించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

జమ్ములో తొలి మరణం...

గురువారం జమ్ముకశ్మీర్​లో తొలి కరోనా మరణం సంభవించింది. శ్రీనగర్​లోని ఓ ఆసుపత్రిలో 65ఏళ్ల వృద్ధుడు.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కలిసిన నలుగురికీ కరోనా పాజిటివ్​గా తేలినట్టు అధికారులు తెలిపారు. దీనితో జమ్ముకశ్మీర్​లో ఇప్పటి వరకు మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. మరో 5వేల 124 మందిపై నిఘా పెట్టారు.

అయితే.. కేసుల సంఖ్యపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా మంది తమ విదేశీ పర్యటనల వివరాలను వెల్లడించడం లేదని.. దీని వల్ల కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

మహారాష్ట్రలో...

మహారాష్ట్రలోని ముంబయిలో ఈ నెల 24న మృతిచెందిన ఓ మహిళ రిపోర్టుల్లో కరోనా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు ముంబయిలో చికిత్స పొందుతున్న ఓ 65ఏళ్ల వృద్ధురాలు.. గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. వైరస్​ పాజిటివ్​గా తేలినప్పటికీ... మృతిచెందడానికి గల కారణాలను పరిశీలిస్తునట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

పెరుగుతున్న కేసులు...

మధ్యప్రదేశ్​లో తాజాగా మరో ఐదుగురు కరోనా బారినపడ్డారు. ఆ రాష్ట్రంలో వైరస్​ కేసుల సంఖ్య 20కి చేరింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది అక్కడి ప్రభుత్వం. వైరస్​ కట్టడికి కిఠన చర్యలు తీసుకుంటోంది.

మొహల్లా క్లినిక్​ వైద్యుడికి...

దిల్లీలో మొత్తం 36మందికి వైరస్​ సోకింది. వీరిలో మొహల్లా క్లినిక్​ డాక్టర్​ ఒకరు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన మహిళను కలిసినందు వల్లే వైద్యుడికి వైరస్​ సోకిందని దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్​ జైన్​ తెలిపారు. డాక్టర్​తో పాటు మరో నలుగురికీ వైరస్​ సోకిందన్నారు. అయితే వైద్యుడిని కలిసిన దాదాపు 800మందిని 14రోజుల పాటు క్వారంటైన్​ చేసినట్టు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.