ETV Bharat / bharat

నేటి నుంచి పూర్తి సామర్థ్యంతో సుప్రీం కోర్టు - సుప్రీం ధర్మాసనాలు

కరోనా మహమ్మారి కారణంగా గత ఏడు నెలలుగా కేవలం 5 ధర్మాసనాలతోనే వర్చువల్​గా పని చేసిన సుప్రీం కోర్టు.. నేటి నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. సోమవారం నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా 12 ధర్మాసనాలు రోజువారీ విచారణ చేపట్టనున్నాయి.

Supreme Court
సుప్రీం కోర్టు
author img

By

Published : Oct 12, 2020, 5:10 AM IST

కరోనా మహమ్మారి రాకముందరి స్థితితో సోమవారం నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది దేశ సర్వోన్నత న్యాయస్థానం. సోమవారం నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా 30 మంది న్యాయమూర్తులతో కూడిన 12 ధర్మాసనాలు రోజువారీ విచారణలు చేపట్టనున్నాయి.

దేశంలోకి కరోనా వైరస్​ ప్రవేశించిన క్రమంలో మార్చి నుంచి ఇద్దరి నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన 5 ధర్మాసనాలు రోజుకు 20 కేసులు విచారణ చేపడుతున్నాయి. అయితే.. సుప్రీం కోర్టు వెబ్​సైట్​ ప్రకారం అక్టోబర్​ 12 నుంచి 2-3 మంది జడ్జీలతో కూడిన 10 ధర్మాసనాలు, రెండు ఏకసభ్య ధర్మాసనాలు రోజువారీ విచారణలు చేపట్టనున్నాయి. పూర్తిస్థాయిలో ధర్మాసనాలు అందుబాటులోకి వచ్చిన క్రమంలో న్యాయస్థానం ఉత్పాదకత రెట్టింపు కానుంది. అయితే.. కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న క్రమంలో భౌతక విచారణపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

సోమవారం నుంచి అందుబాటులోకి రానున్న ధర్మాసనాల్లో ఎనిమిదింటిలో ముగ్గురు న్యాయమూర్తులు, రెండింటిలో ఇద్దరు జడ్జీలు ఉండనున్నారు. రెండు ఏకసభ్య ధర్మాసనాలు విచారణతో పాటు ట్రాన్స్​ఫర్​ పిటిషన్లపై నిర్ణయాలు తీసుకోనున్నాయి.

కరోనా వైరస్​ విజృంభణతో న్యాయస్థానం రిజిస్ట్రీ కూడా తక్కువ మంది సిబ్బందితోనే పని చేస్తోంది. లాక్​డౌన్​తో రవాణా సౌకర్యం లేకపోవటం, వైరస్​ వ్యాప్తి ముప్పు వంటి కారణాలతో ఈ మేరకు నిర్ణయంతీసుకుంది.

ఇదీ చూడండి: వాక్​ స్వతంత్రం దుర్వినియోగంపై సుప్రీం ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.