ETV Bharat / bharat

టీకా ఉత్పత్తిపై భారత్​తో రష్యా సంప్రదింపులు - స్పుత్నిక్ వీ

రష్యా కరోనా టీకా 'స్పుత్నిక్-వి'ని ఉత్పత్తి చేసేందుకు సహకారాన్ని కోరుతూ ఆ దేశ రాయబారి భారత అధికారులను సంప్రదించారు. ప్రధాన శాస్త్రీయ సలహాదారు విజయ్ రాఘవన్, వైద్య పరిశోధన కార్యదర్శి బలరాం భార్గవ, జీవ సాంకేతిక శాఖ కార్యదర్శి రాణు స్వరూప్​ను కలిసి చర్చించినట్లు అధికారులు వెల్లడించారు.

Russia approaches India for Sptunik V collaboration
స్పుత్నిక్ వీ ఉత్పత్తికి భారత్​తో రష్యా సంప్రదింపులు
author img

By

Published : Aug 25, 2020, 3:13 PM IST

రష్యా తయారు చేసిన 'స్పుత్నిక్-వి' కొవిడ్ టీకాను భారీగా ఉత్పత్తి చేసేందుకు భారత్​ సహకారాన్ని కోరుతూ ఆ దేశ రాయబారి అధికారిక సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు... ప్రధాన శాస్త్రీయ సలహాదారు విజయ్ రాఘవన్​, వైద్య పరిశోధన శాఖ కార్యదర్శి డా. బలరాం భార్గవ, జీవసాంకేతిక శాఖ కార్యదర్శి రాణు స్వరూప్​ను భారత్​లోని రష్యా రాయబారి నికోలే కుదాషెవ్​ కలిసినట్లు అధికారులు వెల్లడించారు.

రష్యా వ్యాక్సిన్​కు సంబంధించి అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ ఇదివరకే ప్రకటించింది. రష్యాలోని భారత రాయబార కార్యాలయం సైతం గమలేయ పరిశోధన సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది.

"స్పుత్నిక్-వి విషయంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఏ విదేశీ వ్యాక్సిన్​కు అయినా దేశంలో ట్రయల్స్​ నిర్వహించిన తర్వాతే ఆమోదం లభిస్తుంది. భారత్​లో స్పుత్నిక్-వి టీకా ఉత్పత్తి చేయాలంటే డీసీజీఐ అనుమతి తప్పనిసరి."

-వైద్య శాఖ అధికారులు

'స్పుత్నిక్-వి'ని ప్రపంచంలోనే తొలి కొవిడ్ టీకాగా పరిగణిస్తున్నారు. అయితే ఈ టీకా తయారీకి సంబంధించి సమాచారాన్ని ఇతర దేశాలతో రష్యా పంచుకోలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సైతం ఈ వివరాలు ఇవ్వలేదు.

టీకా ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్​ను ఆగస్టు 1న పూర్తి చేసినట్లు రష్యా ప్రకటించింది. ట్రయల్స్​లో పాల్గొన్న వలంటీర్లు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపింది. అయితే టీకాపై ట్రయల్స్ పూర్తి స్థాయిలో చేయలేదని శాస్త్రవేత్తల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదీ చదవండి- వ్యాక్సిన్​ ఉత్పత్తిలో భారత్​ సాయం కోరిన రష్యా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.