ETV Bharat / bharat

చంద్రయాన్​-2 నడిపింది... ఈ 'రాకెట్'​ మహిళలే - చంద్రయాన్​-2 ప్రాజెక్ట్​ డైరెక్టర్​ ముత్తయ్య వనిత

చంద్రయాన్‌-2 విజయంలో మిషన్‌ డైరెక్టర్‌ రీతూ కరిధాల్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ ముత్తయ్య వనిత కీలకపాత్ర పోషించారు. ఇస్రో చేపట్టిన మంగళ్‌యాన్‌ ప్రాజెక్టులో సాధించిన అనుభవంతో ఈ ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-2 ప్రాజెక్టును ముందుండి నడిపించారు. వీరితో పాటు ఈ మిషన్‌కు పని చేసిన బృందంలో 30 శాతం మంది మహిళా శాస్త్రవేత్తలే కావడం విశేషం.

చంద్రయాన్​-2 నడిపింది... ఈ 'రాకెట్'​ మహిళలే
author img

By

Published : Sep 6, 2019, 8:46 PM IST

Updated : Sep 29, 2019, 4:41 PM IST

ఎవరైనా గొప్ప ఘనతలను సాధిస్తే "వారికి ఆకాశమే హద్దు" అంటాం. కానీ అంతరిక్ష పరిశోధనా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన వారికి మాత్రం ఆకాశం ఓ ప్రయోగశాల మాత్రమే. చంద్రయాన్‌-2 మిషన్‌ డైరెక్టర్‌ రీతూ కరిధాల్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ ముత్తయ్య వనిత ఈ ఘనతతో తమ పేర్లను అంతరిక్ష పరిశోధన రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 69 ప్రముఖ సైన్స్‌ అకాడమీల్లో 12 శాతం మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రాజెక్టును ముందుండి నడిపించారు రీతూ కరిధాల్‌, ముత్తయ్య వనిత.

అంచెలంచెలుగా ఎదిగి..

chandrayaan-2 mission director Ritu Karidhal
చంద్రయాన్‌-2 చంద్రయాన్​-2 మిషన్‌ డైరెక్టర్‌ రీతూ కరిధాల్‌

చంద్రయాన్ -2 ప్రాజెక్టులో మిషన్ డైరెక్టర్‌గా రీతూ కరిధాల్‌ నియామకం ఒక్క రోజుతో సాకారం కాలేదు. ఓ వైపు పరిశోధనలు, మరోవైపు కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ఇస్రో చేపట్టిన మంగళ్​యాన్‌కు డిప్యూటీ ఆపరేషన్‌ డైరెక్టర్‌గా పనిచేశారు రీతూ కరిధాల్‌. ఆ అనుభవంతో చంద్రయాన్‌-2కు వచ్చేసరికి మిషన్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మిషన్‌ పూర్తి బాధ్యతలు తన భుజానికెత్తుకున్నారు. చంద్రయాన్‌ ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. ఇతర విభాగాలు, శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రయోగం విజయానికి కృషిచేశారు.

విజయ ప్రస్థానం

చంద్రయాన్‌-2 మిషన్‌ డైరెక్టర్‌గా కీలకపాత్ర పోషించిన రీతూ కరిధాల్‌ లఖ్‌నవూ విశ్వవిద్యాలయం నుంచి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. బెంగళూరులోని ఐఐఎస్​సీలో పీజీ చేశారు. 1997లో ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. 2007లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతులు మీదుగా యువ శాస్త్రవేత్త పురస్కారాన్ని అందుకున్నారు. మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌-2లకు పనిచేయడంద్వారా 'రాకెట్‌ ఉమన్‌ ఆఫ్‌ ఇండియా'గా గుర్తింపు పొందిన రీతూ కరిధాల్‌.. అభిరుచి, నిజాయితీ ఉంటే లక్ష్యాన్ని సాధించడం కష్టమేమీ కాదంటారు.

"మెషీన్‌ డిజైన్‌ నా ప్రధాన బాధ్యత. మెషీన్‌ డిజైనర్‌గా.. మిషన్‌ అసలైన లక్ష్యాలేంటి, వాటిని ఎలా సాధించాలో నేను తెలుసుకోవాలి. దేనిపైనైనా అభిరుచి ఉంటే.. అటే మనం నిరంతరం ప్రయాణిస్తాం. ఎలాంటి అవాంతరాలు, ఆటంకాలు ఎదురైనా.... వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలి. మన పనితనం, అభిరుచి, నిజాయితీని మన చుట్టూ ఉన్నవారు గమనిస్తే.. మనకు సహకరించాలని వారి మనసూ కోరుకుంటుంది."- రీతూ కరిధాల్‌, మిషన్‌ డైరెక్టర్‌, చంద్రయాన్‌-2

ముత్తయ్య వనిత

chandrayaan-2 project director vanitha
చంద్రయాన్‌-2 ప్రాజెక్టు డైరెక్టర్‌ ముత్తయ్య వనిత

చంద్రయాన్‌–2 ప్రయోగంలో మరో కీలక శక్తి ముత్తయ్య వనిత. చంద్రయాన్‌-2 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వనిత ఉపగ్రహాల రూపకల్పనలో నిపుణురాలు. ఈ తరహా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా శాస్త్రవేత్తగా ఆమె గుర్తింపు పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు.. బృంద సభ్యులను సమన్వయం చేసుకునే శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు ఆమె సొంతం.

ప్రాజెక్టులోని ప్రతి అంశంపై పట్టు ఉన్న ఆమె హార్డ్‌వేర్‌ అభివృద్ధి, ప్రాజెక్టు పూర్తికావడానికి కావాల్సిన ఇతర పరిశోధనలను పర్యవేక్షించారు. చంద్రయాన్‌-2 ప్రయోగం తొలి దశ నుంచి లక్ష్యం నెరవేరే వరకు ఆమె ఎన్నో బాధ్యతలను నిర్వర్తించారు. ఈ ప్రయోగంలో ప్రతి నిమిషానికీ ఆమె బాధ్యురాలు.

విశిష్ట గుర్తింపు

అంతరిక్ష ప్రయోగాల్లో వనిత చేసిన సేవలను గుర్తించి ఆస్ట్రనామికల్‌ సొసైటీ అఫ్‌ ఇండియా 2006లో ఆమెకు 'ఉత్తమ మహిళా శాస్త్రవేత్త' అవార్డు ప్రదానం చేసింది.

ఇదీ చూడండి: జాబిల్లిని ముద్దాడే వేళ... విక్రమ్​, ప్రజ్ఞాన్​ పరిహాసాలు

SHOTLIST:
RESTRICTION SUMMARY: MUST CREDIT BERLIN ZOO; MATERIAL CAN ONLY BE USED FOR THE PURPOSES OF REPORTING ON ZOO BERLIN; ALL OTHER RIGHTS ARE RESERVED, PARTICULARLY, BUT NOT EXCLUSIVELY, THE RIGHT TO USE THIS MATERIAL FOR COMMERCIAL PURPOSES
BERLIN ZOO - MUST CREDIT BERLIN ZOO; MATERIAL CAN ONLY BE USED FOR THE PURPOSES OF REPORTING ON ZOO BERLIN; ALL OTHER RIGHTS ARE RESERVED, PARTICULARLY, BUT NOT EXCLUSIVELY, THE RIGHT TO USE THIS MATERIAL FOR COMMERCIAL PURPOSES
Berlin, Germany, 6 September 2019
1. Panda cub and her mother                       
++BLACK FRAMES++
2. Various of panda cub and her mother   
STORYLINE:
BERLIN ZOO PANDA CUBS NURTURED BY MOTHER MENG MENG
Berlin Zoo has released video of two baby panda cubs being nurtured by their mother, Meng Meng, after they were born earlier last month.
Germany's only giant pandas have been living in Berlin Zoo since the summer of 2017.
Meng Meng gave birth to the two cubs on August 31.
The father, Jiao Qing, is not involved in the rearing - as is typical for giant pandas.
According to the most recent count of the worldwide population, there are only about 1,864 adult panda left in their natural habitat.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.