ETV Bharat / bharat

రాజస్థాన్​ సంక్షోభంపై భాజపా వ్యూహమేంటి?

author img

By

Published : Jul 14, 2020, 11:21 AM IST

Updated : Jul 14, 2020, 10:15 PM IST

rajasthan-clp-meets-again
కొలిక్కిరాని బుజ్జగింపులు

22:10 July 14

భాజపా వ్యూహమేంటి?

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బుధవారం జైపుర్​లో భాజపా సమావేశంకానుంది. ఇందులో సీనియర్​ నేతలు పాల్గొనున్నట్టు తెలుస్తోంది. అయితే భాజపా కీలక నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రస్తుతం ధోల్​పుర్​లో ఉన్నారు. ఆమె జైపుర్​కు చేరుకున్న వెంటనే ఈ భేటీ ప్రారంభంకానుంది.

22:06 July 14

ముగిసిన భేటీ..

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ నివాసంలో కేబినెట్​ సమావేశం ముగిసింది. ఈ సమావేశంతో పాటు మంత్రి మండలి భేటీ కూడా ముగిసింది. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై మంత్రులు చర్చించినట్టు తెలుస్తోంది. 

19:50 July 14

ధన్యవాదాలు తెలిపిన పైలట్​...

సచిన్​ పైలట్​పై కాంగ్రెస్​ వేటు వేసిన నేపథ్యంలో.. ఆయనకు రాజస్థాన్​వ్యాప్తంగా అనేకమంది నుంచి మద్దతు లభిస్తోంది. పైలట్​పై వేటుకు నిరసనగా ఇప్పటికే పలువురు పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆఫీస్​ బేరర్లు కాంగ్రెస్​కు రాజీనామా చేశారు. వీటిపై పైలట్​ స్పందించారు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పైలట్​.

19:16 July 14

  • #Rajasthan Chief Minister Ashok Gehlot, along with state ministers, leave from Fairmont Hotel for his residence.

    State cabinet meeting to be held at CM's residence at 7:30 pm and meeting of Council of Ministers at 8:00 pm today. pic.twitter.com/Y7rsjjkkbD

    — ANI (@ANI) July 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరికాసేపట్లో కేబినెట్​ భేటీ..

రాత్రి 7.30 గంటలకు రాజస్థాన్​ కేబినెట్​ సమావేశం జరగనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​.. తన మంత్రులతో కలిసి హోటల్​ నుంచి నివాసానికి బయల్దేరారు.  

18:53 July 14

రాజీనామాలు...

సచిన్​ పైలట్​ను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్​ పదవుల నుంచి తప్పించడంపై రాజస్థాన్​లో నిరసనలు మొదలయ్యాయి. ఈ మేరకు టాంక్​ పట్టణంలో కాంగ్రెస్​కు చెందిన 59మంది ఆఫీస్​ బేరర్లు తమ రాజీనామాలను సమర్పించారు.

18:46 July 14

'సామర్థ్యానికి చోటు లేదు...'

రాజస్థాన్​ సంక్షోభంపై భాజాపా ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ప్రస్తుతం కాంగ్రెస్​లో శక్తి, సామర్థ్యాలకు చోటు లేదని వ్యాఖ్యానించారు. ఇది ప్రతి రాష్ట్రంలోనూ కనపడుతోందని వెల్లడించారు.

కాంగ్రెస్​తో విభేదించిన సింధియా.. ఈ ఏడాది మార్చిలో పార్టీని వీడి భాజపాలో చేరారు. ఫలితంగా కమల్​నాథ్​ నేతృత్వంలోని మధ్యప్రదేశ్​ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం భాజపా ప్రభుత్వాన్ని స్థాపించింది. భాజపా తరపున మధ్యప్రదేశ్​ నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎంపికయ్యారు సింధియా. 

17:56 July 14

కేబినెట్​ సమావేశం...

సచిన్​ పైలట్​ను తొలగించిన అనంతరం రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​​ స్పీడు పెంచారు. ఇప్పటికే గవర్నర్​ను కలిసిన సీఎం​.. తాజాగా కేబినెట్​ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరగనున్న ఈ భేటీలో మంత్రి పదవులను పునర్యవస్థీకరించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అనంతరం రాత్రి 8 గంటలకు మంత్రి మండలితో గహ్లోత్​ భేటీ కానున్నారు. 

15:11 July 14

'సచిన్​ కాదు.. ఇది భాజపా పనే'

గవర్నర్​ను కలిసిన అనంతం మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. రాజస్థాన్​లో ప్రస్తుత పరిస్థితులకు భాజపా కారణమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి సుదీర్ఘంగా భాజపా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తమ మిత్రుల్లోని కొందరు దిల్లీ వెళ్లారని సచిన్​ పైలట్​ను పరోక్షంగా ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భాజపా కుట్రలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం(పైలట్​ తొలగింపు) తీసుకోక తప్పలేదన్నారు. 

నిజానికి సచిన్​ పైలట్​ చేతుల్లో కూడా ఏమీ లేదని.. ఇదంతా భాజపా ఆడుతున్న నాటకమని తీవ్ర స్థాయిలో ఆరోపించారు గహ్లోత్​. రిసార్టులను ఏర్పాటు చేసింది భాజపాయేనని.. మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ను దెబ్బతీసిన బృందమే.. ఇక్కడ కూడా పని చేసిందని మండిపడ్డారు.

15:02 July 14

  • Rajasthan Governor Kalraj Mishra has accepted CM Ashok Gehlot's proposal to remove Sachin Pilot as Deputy CM, and Vishvender Singh and Ramesh Meena as ministers. https://t.co/FGppoHMV5c

గవర్నర్​ వద్దకు గహ్లోత్​...

సచిన్​ పైలట్​ను తొలగించిన అనంతరం కాంగ్రెస్​ వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రాను కలిశారు. పైలట్​ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలన్న గహ్లోత్​ ప్రతిపాదనను.. గవర్నర్​ వెంటనే ఆమోదించారు. అదే విధంగా విశ్వేందర్​ సింగ్​, రమేశ్​ మీనాలను మంత్రి పదవుల నుంచి తప్పించాలన్న గహ్లోన్​ విజ్ఞప్తిని కూడా అంగీకరించారు గవర్నర్​.

మరోవైపు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి చేరుకున్నారు పార్టీ​ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. రాజస్థాన్​ పరిణామాలపై వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయి.

14:50 July 14

'నిజాన్ని ఓడించలేరు...'

రెబల్​ నేత సచిన్​ పైలట్​ను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్​ పదవుల నుంచి కాంగ్రెస్​ తొలగించిన అనంతరం.. రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. తాజాగా ఈ పూర్తి వ్యవహారంపై సచిన్​ పైలట్​ తొలిసారి స్పందించారు. 'నిజాన్ని అడ్డుకోవచ్చు కానీ.. ఓడించలేరు' అంటూ హిందీలో ట్వీట్​ చేశారు.

అనంతరం తన ట్విట్టర్​ బయో నుంచి కాంగ్రెస్​కు సంబంధించిన వివరాలను తొలగించారు సచిన్​ పైలట్​. 

13:45 July 14

సచిన్​ పైలట్​ను రాజస్థాన్​ డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగించినట్లు సుర్జేవాలా తెలిపారు. ఆయన స్థానంలో గోవింద్​ సింగ్ డోటాస్రాను నియమించినట్లు వెల్లడించారు. 

రాజస్థాన్ కాంగ్రెస్​ నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పైలట్​ను పార్టీ నుంచి తొలగించాలని 102 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా సమ్మతి తెలిపిన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు సుర్జేవాలా.​

రాజస్థాన్‌ ప్రభుత్వంలో సంక్షోభానికి భాజపానే కారణమని సూర్జేవాలా ఆరోపించారు. కాంగ్రెస్‌ శాసనసభ్యులను భాజపా ప్రలోభానికి గురిచేసిందన్నారు. సచిన్‌ పైలట్‌ను పార్టీ నుంచి తొలగించాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. 

13:39 July 14

రాజస్థాన్​ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరేసిన సచిన్​ పైలట్​పై కాంగ్రెస్​ వేటు వేసింది. ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి లొలగిస్తున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ప్రకటించారు.

13:39 July 14

డిప్యూటీ సీఎం పదవి నుంచి సచిన్ పైలట్​ తొలగింపు

రాజస్థాన్​ డిప్యూటీ సీఎం పదవి నుంచి సచిన్ పైలట్​ తొలగించినట్లు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ప్రకటించారు.

12:36 July 14

సచిన్ పైలెట్ వర్గంపై క్రమశిక్షణ చర్యలు

సచిన్ పైలట్​, అతని వర్గంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సీఎల్పీ భేటీలో తీర్మానాన్ని ఆమోదించారు.

12:36 July 14

12:19 July 14

జైపూర్​ ఫెయిర్​మౌంట్ హోటల్​లో​ సీఎల్​పీ భేటీ

Rajasthan CLP meets again
జైపూర్​ ఫెయిర్​మౌంట్ హోటల్​ సీఎల్​పీ మీటింగ్​

రాజస్థాన్ జైపూర్‌లోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్‌పీ) సమావేశం జరుగుతోంది.

10:34 July 14

పైలట్​ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్​

రాజస్థాన్‌లో అశోక్ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న బుజ్జగింపు ప్రయత్నాలు కొలిక్కిరావడం లేదు. మంగళవారం మరోసారి నిర్వహించిన సీఎల్పీ భేటీకి ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌తో పాటు ఆయన వర్గం హాజరు కాలేదు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, అహ్మద్‌ పటేల్‌, చిదంబరం, కేసీ వేణుగోపాల్‌ వంటి నేతలు సచిన్‌ పైలట్‌తో పలుమార్లు మాట్లాడినా ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ అధిష్ఠానం సచిన్‌తో చర్చించేందుకు సుముఖంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. అయితే సీఎల్పీ భేటీ అనంతరం తదుపరి కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

ఈ సంక్షోభం సమయంలో  కాంగ్రెస్​కు మిత్రపక్షమైన భారతీయ ట్రైబల్‌ పార్టీ(బీటీపీ) తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. బీటీపీకి ఇద్దరు శాసనసభ్యులు ఉండగా వారు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి వర్గాలకు దూరంగా ఉండనున్నట్లు పార్టీ తెలిపింది.  

Last Updated : Jul 14, 2020, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.