ETV Bharat / bharat

చెట్టు కింద శాసనసభ సమావేశాలు

పచ్చని చెట్టు కింద పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత శాసనసభ సమావేశాలు జరిగాయి. ఓ సభ్యుడికి కరోనా అని తేలిన కారణంగా అసెంబ్లీ భవనాన్ని శానిటైజ్​ చేయాల్సి వచ్చింది. సమావేశాల చివరి రోజు కావడం, బడ్జెట్​కు ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం మేరకు ఆవరణలోని వేప చెట్టుకింద సభ నిర్వహించారు.

puducheri
పచ్చని చెట్టు కింద శాసనసభ సమావేశాలు
author img

By

Published : Jul 25, 2020, 9:24 PM IST

పుదుచ్చేరి శాసనసభలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఓ సభ్యుడికి కరోనా పాజిటివ్‌ అని తేలిన కారణంగా అసెంబ్లీ సమావేశాలను తొలిసారిగా చెట్టు కింద నిర్వహించారు.

puducheri
అసెంబ్లీని శానిటైజ్ చేస్తున్న సిబ్బంది

పుదుచ్చేరి శాసనసభ సమావేశాలు ఈ నెల 20న ప్రారంభం అయ్యాయి. అయితే సభకు హాజరైన విపక్ష సభ్యుడు ఎన్​ఎస్​జే జయబాల్‌ కరోనా సోకి శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో శాసనసభ ప్రధాన భవనాన్ని శానిటైజేషన్‌ కోసం మూసివేశారు. శనివారం సమావేశాలకు చివరి రోజు. ప్రధాన భవనం అందుబాటులో లేని కారణంగా సభ ప్రాంగణంలోని తోటలో ఉన్న వేప చెట్టు కింద సమావేశాలను నిర్వహించారు. సభాపతి సహా సభ్యులు అందరికీ అక్కడే కుర్చీలు వేసి సభ నిర్వహించారు. సమావేశాల్లో బడ్జెటరీ కేటాయింపులకు ఆమోదం తెలిపి సభను నిరవధికంగా వాయిదా వేశారు. అనంతరం సభ్యులు ఏడు రోజుల పాటు ఐసోలేషన్​లో ఉండాలని నిర్ణయించారు. వీరందరికీ జులై 27న కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

చెట్టుకింద శాసనసభ సమావేశాలు

సభ ప్రారంభం రోజు కూడా అరుదైన దృశ్యమే చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి నారాయణ స్వామితో విభేదాల నేపథ్యంలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ప్రసంగం చేయడానికి రాలేదు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ లేకుండానే నాడు సభను ప్రారంభించారు.

ఇదీ చూడండి: దక్షిణ భారతంలో ఐసిస్​ ఉగ్రవాదుల అలికిడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.