యానాం కళాశాలకు ఆన్లైన్ ద్వారా ప్రధాని శంకుస్థాపన - PM MODI
యానాంలో కేంద్ర నిధులతో నిర్మితమవుతున్న ఇంజినీరింగ్ కళాశాలకు ఆన్లైన్ ద్వారా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.
ఇంజినీరింగ్ కళాశాల శిలాఫలకం
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన యానంలో ప్రతిష్టాత్మకంగా పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించనున్న ఇంజనీరింగ్ కాలేజీ కి జమ్మూ కాశ్మీర్ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆన్లైన్లో డిజిటల్ ఫౌండేషన్ వేశారు ఈ కాలేజీ నిర్మాణం కొరకు యానం శివారు ప్రాంతం సుమారు 16 ఎకరాలు స్థలాన్ని ప్రభుత్వం కేటాయించగా 25 కోట్ల వ్యయంతో నిర్మించబోయే భవనాల కొరకు ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్ నుండి లాంచనంగా ప్రారంభించగా ఇక్కడ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు వేలాది మంది ప్రజలు విద్యార్థుల సమక్షంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు