కరోనా కారణంగా రెండున్నర నెలలుగా మూతపడిన ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకున్నాయి. దేశ రాజధాని దిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో ఆలయాలు ప్రత్యేక పూజలతో దేదీప్యమానంగా కళకళలాడుతున్నాయి.
- ఈ సందర్భంగా ఆయా ప్రదేశాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహకులు.
- ఆలయం లోపలికి భక్తులను దశలవారీగా అనుమతిస్తున్నారు.
- ప్రసాదం, తీర్థం ఇవ్వడం, పవిత్ర జలం జల్లడం వంటివి చేయడం లేదు.
- భౌతిక దూరం పాటిస్తూ భక్తులు.. మాస్కులతో ఆలయాలకు వస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలో ఈద్ఘా మసీదును ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ తెరిచారు. నమాజు కోసం ముస్లిం సోదరులు మాస్కులతో వస్తున్నారు.