ETV Bharat / bharat

'వ్యవసాయ బిల్లులతో బానిసలుగా రైతులు' - rahul gandhi on farm bills

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులు బానిసలుగా మారతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు పిలుపునిచ్చిన 'భారత్​ బంద్'​కు మద్దతు ప్రకటించారు.

rahul
రాహుల్ గాంధీ
author img

By

Published : Sep 25, 2020, 1:07 PM IST

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న 'భారత్​ బంద్'​కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ఈ బిల్లులతో రైతులను బానిసలుగా మారాల్సి వస్తుందని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

"లోపభూయిష్ట జీఎస్​టీతో ఎంఎస్​ఎంఈలు నాశనమమయ్యాయి. ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలతో మన రైతులు బానిసలుగా మారతారు. అందుకే భారత్​ బంద్​కు మద్దతిస్తున్నా."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ఈస్టిండియా కంపెనీ పాలనలా..

అంతకుముందు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా తన మద్దతు తెలిపారు.

  • किसानों से MSP छीन ली जाएगी। उन्हें कांट्रेक्ट फार्मिंग के जरिए खरबपतियों का गुलाम बनने पर मजबूर किया जाएगा।

    न दाम मिलेगा, न सम्मान।
    किसान अपने ही खेत पर मजदूर बन जाएगा।

    भाजपा का कृषि बिल ईस्ट इंडिया कम्पनी राज की याद दिलाता है।

    हम ये अन्याय नहीं होने देंगे।#BharatBandh

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రైతుల నుంచి కనీస మద్దతు ధర లాక్కున్నారు. ఒప్పంద వ్యవసాయం ద్వారా కోటీశ్వరుల చేతుల్లో రైతులు బానిసలుగా మారతారు. వారికి సరైన ధరలే కాదు, గౌరవమూ లభించదు. సొంత పొలంలోనే రైతులు కూలీలుగా పనిచేయాల్సి వస్తుంది. భాజపా వ్యయసాయ బిల్లులు ఈస్టిండియా కంపెనీ పాలనను గుర్తుచేస్తున్నాయి. ఈ అన్యాయాన్ని మేం జరగనివ్వం."

- ప్రియాంక గాంధీ

పార్లమెంటు ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అనేక రైతు సంఘాలు దేశవ్యాప్తంగా శుక్రవారం నిరసనలు, బంద్​కు పిలుపునిచ్చాయి.

ఇదీ చూడండి: 'రైతు సంక్షేమం కోసమే సంస్కరణలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.