ETV Bharat / bharat

భారత్​-నేపాల్​ మధ్య ఉన్నత స్థాయి చర్చలు

భారత్​ సహాయంతో నేపాల్​లో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించేందుకు ఇరు దేశాలు సోమవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేమయ్యాయి. ప్రాజెక్టులను సమీక్షించిన అనంతరం.. వాటి పనులను వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

Nepal, India hold high-level talks amidst border row
భారత్​-నేపాల్​ మధ్య ఉన్నతస్థాయి సమావేశం
author img

By

Published : Aug 17, 2020, 1:35 PM IST

Updated : Aug 17, 2020, 4:59 PM IST

భారత్​-నేపాల్​ సీనియర్​ దౌత్యాధికారులు సోమవారం సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన ఈ ఉన్నతస్థాయి భేటీలో భారత్​ సహాయంతో నేపాల్​లో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను ఇరు దేశాల అధికారులు సమీక్షించారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

నేపాల్​ విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం.. కాఠ్​మాండూలోని భారత రాయబారి వినయ్​ మోహన్​, ఆ దేశ విదేశాంగ కార్యదర్శి శంకర్​ దాస్​ నేతృత్వంలో ఈ భేటీని నిర్వహించారు.

భూకంపం వల్ల గూర్ఖా, నువాకోట్​ జిల్లాల్లో దెబ్బతిన్న 46,301 ఇళ్ల పునర్​నిర్మాణం, మోతిహరి-అమ్​లిఖ్​గుంజ్​ ప్రాంతంలో సరిహద్దు వెంబడి పెట్రోలియం ఉత్పత్తి పైప్​లైన్ల పనితీరుపై ఇరు దేశాలు సమీక్ష నిర్వహించాయి.

ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు భారత్​ అందించిన సహాయంపై నేపాల్​ కృతజ్ఞతలు తెలిపినట్టు సమాచారం.

ఇదీ చూడండి:- నేపాల్​ వల్లే బిహార్​కు ఇన్ని ఇబ్బందులు: నితీశ్

నేపాల్​ దూకుడు వైఖరితో గతకొన్ని నెలలుగా ఇరు దేశాల సంబంధాలు బలహీనపడ్డాయి. భారత భూభాగంలోని పలు ప్రాంతాలను తమ దేశానికే చెందినట్టు ఓ రాజకీయ మ్యాప్​కు ఆమోదముద్ర వేసింది నేపాల్​ ప్రభుత్వం. ఈ వ్యవహారంపై భారత్​ తీవ్రంగా స్పందించింది.

ఇవీ చూడండి:-

Last Updated : Aug 17, 2020, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.