ETV Bharat / bharat

'రోజుకు 3 లక్షల పీపీఈ కిట్లు, ఎన్​95 మాస్కుల ఉత్పత్తి'

దేశంలో పీపీఈలు, ఎన్​95 మాస్కుల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపింది కేంద్రం. రోజుకు 3 లక్షల యూనిట్లు తయారవుతున్నాయని పేర్కొంది. అయితే.. వాటి నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంది. వివిధ దశల్లో పరీక్షించి, అనుమతించిన తర్వాతే సేకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా సరఫరా చేస్తున్నామని పేర్కొంది.

Manufacturing of PPEs
రోజుకు 3 లక్షల పీపీఈ కిట్లు, ఎన్​95 మాస్కుల ఉత్పత్తి
author img

By

Published : May 25, 2020, 3:52 PM IST

దేశంలో కరోనా వైరస్​ వేగంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో అవసరానికి తగినట్లుగా వ్యక్తిగత భద్రతా కిట్లు(పీపీఈ), ఎన్​95 మాస్కుల ఉత్పత్తి గణనీయంగా పెరిగినట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. రోజుకు 3 లక్షల పీపీఈలు, 3 లక్షల ఎన్​95 మాస్కులు ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది. కఠిన నియమాలను అనుసరిస్తూ వాటి నాణ్యతలో ఎలాంటి రాజీ పడటం లేదని తెలిపింది. ఉత్పత్తి పెరగటం ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అవసరాలను తీర్చగలుగుతున్నట్లు పేర్కొంది.

పీపీఈల నాణ్యత లోపిస్తున్నట్లు ఇటీవలే కొన్ని నివేదికలు ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది కేంద్రం.

"కొన్ని వార్తా సంస్థలు పీపీఈ కిట్ల నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. నివేదకల్లో చూపిన ఉత్పత్తులకు, కేంద్రం సేకరిస్తున్న ఉత్పత్తులకు ఎలాంటి సంబంధం లేదు. ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రులు, ఆరోగ్య సంరక్షణ సంస్థల కోసం హెచ్ఎ​ల్​ఎల్​ లైఫ్​కేర్​ వీటిని సేకరిస్తోంది. జౌళి శాఖ (ఎంఓటీ) గుర్తింపు పొందిన ల్యాబ్​లో పరీక్షలు చేసి, అనుమతించిన క్రమంలోనే తయారీదారుల నుంచి పీపీఈ కిట్లను సేకరిస్తున్నాం. అనంతరం సాంకేతిక కమిటి జీఎంజీ పరీక్షిస్తుంది. అంతేకాకుండా హెచ్​ఎల్​ఎల్​ కూడా సరఫరాకు పంపే వాటిలో కొన్ని నమూనాలను సేకరించి పరీక్షిస్తుంది. ఏదైన వైఫల్యం ఉంటే, ఆ సంస్థను సరఫరాకు అనర్హులుగా గుర్తింస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర సంస్థలకు ఇప్పటి వరకు 111.08 లక్షల ఎన్​95 మాస్కులు, 74.48 లక్షల పీపీఈ కిట్లను అందించాం."

– కేంద్ర ఆరోగ్య శాఖ.

ఎంఓటీ శాఖ గుర్తింపు పొందిన ల్యాబ్​లో పరీక్షించిన పీపీఈ కిట్లను సేకరించేందుకు అనుమతించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హత పొందిన సంస్థలను ప్రభుత్వ ఈ మార్కెట్​ (జెమ్​) పరిధిలోకి తీసుకువచ్చింది కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.