గ్యాస్ ఏజెన్సీ మేనేజర్‌తో డబ్బు విషయంలో విభేదాలు తలెత్తడం వల్ల ఓ సప్లయర్.. 61 ఎల్పీజీ సిలిండర్లతో పరారైన ఘటన దిల్లీలో జరిగింది. ఈ వ్యవహారాన్ని మాల్వియా నగర్ పోలీస్ స్టేషన్లో మేనేజర్ ఫిర్యాదు చేయడం వల్ల ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం నిందితుడు గోవింద్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిఘా, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సింగ్ ఎక్కడున్నాడన్న విషయాన్ని గుర్తించారు పోలీసులు. దొంగలించిన సిలిండర్లను ఖాన్పుర్ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. మేనేజర్‌తో లావాదేవీల వ్యవహారంలో విభేదాలు ఉండటం వల్లే తాను ఈ పని చేయాల్సి వచ్చిందని నిందితుడు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి:- విషాహారం తిని 70 గోవులు మృత్యువాత