ETV Bharat / bharat

భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో... - #gas leakage

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్టణంలో జరిగిన గ్యాస్​ దుర్ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. సర్వత్రా విషాదఛాయలు అలముకున్నాయి. అయితే.. దేశంలో ఇంతకుముందు ఇలాంటి ప్రమాదాలెన్నో జరిగాయి. వేలాది మంది జీవితాల్లో చీకటిని మిగిల్చాయి. ఇప్పటికీ ఆ ఘటనల తాలూకు దుష్పరిణామాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి.

Major gas leak accidents in India in recent past
'భోపాల్​' సహా చీకటిని మిగిల్చిన గ్యాస్​ దుర్ఘటనలెన్నో..?
author img

By

Published : May 7, 2020, 1:31 PM IST

కరోనా దెబ్బకు బిక్కుబిక్కుమంటూ లాక్​డౌన్​ జీవితం గడుపుతున్న ప్రజలను విశాఖలో గ్యాస్​ లీకేజీ ఘటన మరింత ఆందోళనకు గురిచేసింది. అయితే.. గతంలోనూ ఇలాంటి సంఘటనలెన్నో జరిగాయి. అవేంటో ఓసారి చూడండి.

1984 డిసెంబర్​ 2- భోపాల్​ దుర్ఘటన.

1984 డిసెంబర్‌ 2వ తేదీ అర్ధరాత్రి దాటాక భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ ప్లాంట్​లో.. 30 టన్నుల అత్యంత విషపూరితమైన వాయువు లీకైంది. మొత్తం 3,787 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యపై వేర్వేరు వాదనలు ఉన్నాయి. దాదాపు 16 వేల మందికిపైనే చనిపోయినట్లు సమాచారం.

2006 నవంబర్​ 12

గుజరాత్​ అంకలేశ్వర్​లోని ఆయిల్​ ఫ్యాక్టరీలో గ్యాస్​ లీకై ముగ్గురు చనిపోయారు.

2010 జులై 16

బంగాల్​లోని దుర్గాపూర్​ ఉక్కు పరిశ్రమలో విషపూరిత కార్బన్ ​ మోనాక్సైడ్​ను పీల్చడం వల్ల 25 మంది అస్వస్థతకు గురయ్యారు.

2011 ఆగస్టు 2

కర్ణాటక జిందాల్​ ఉక్కు కర్మాగారంలోని ఓ కొలిమి నుంచి విషపూరిత వాయువు లీకై.. ముగ్గురు కార్మికుల్ని బలిగొంది.

2013 మార్చి 23

తమిళనాడు తూత్తుకుడిలోని ఓ కర్మాగారం నుంచి విషవాయువు(సల్ఫర్​ డైఆక్సైడ్​గా అనుమానం) లీకైంది. ఒకరు మరణించారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.

2014 జూన్​ 5

తమిళనాడు తూత్తుకుడిలోని నైలా చేపల శుద్ధి కర్మాగారంలో.. గ్యాస్​ పైప్​లైన్​ పేలి విషపూరిత అమోనియా వెలువడింది. ఈ ఘటనలో 54 మంది మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.​

2014 ఆగస్టు 7

కేరళలోని కొల్లంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓ కర్మాగారం సమీపంలో 70 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ప్లాంట్​ నుంచి వెలువడ్డ దట్టమైన పొగను పీల్చడమే కారణం.

2014 ఆగస్టు 27

బంగాల్​లోని వర్ధమాన్​లోని ఓ వెల్డింగ్​ వర్క్​షాప్​లో సిలిండర్​ నుంచి గ్యాస్​ వెలువడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు చనిపోయారు. మరో 50 మంది ఆరోగ్యంపైనా తీవ్రప్రభావం చూపింది.

2014 జులై 13

ఛత్తీస్​గఢ్​లోని భిలాయీ ఉక్కు పరిశ్రమలో గ్యాస్​ లీకైంది. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్​ బీకే సింఘాల్​, ఎన్​కే కటారియా, మరో ఐదుగురు ఉన్నతాధికారులు మరణించారు.

2016 నవంబర్​ 3

గుజరాత్​ నర్మదాలోని ఫర్టిలైజర్స్​ అండ్​ కెమికల్స్​ లిమిటెడ్​ కర్మాగారంలో విషపూరిత ఫాస్ఫరస్​ లీకై.. నలుగురు కార్మికులు చనిపోయారు. మరో 13 మంది ఆసుపత్రుల్లో చేరారు.

2017 మార్చి 15

ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​లో విషాదకర ఘటన జరిగింది. ఓ కోల్డ్​ స్టోరేజీలోని గ్యాస్​ ఛాంబర్​లో అమోనియా గ్యాస్​ లీకైంది. భవనం పైకప్పు కూలి.. 9 మంది చనిపోయారు.

2017 మే 8

దిల్లీ తుగ్లకాబాద్​ ప్రాంతంలో విషవాయువు లీకైంది. ఈ ఘటనలో రాణి ఝాన్సీ సర్వోదయ కన్యా విద్యాలయ బాలికల పాఠశాలకు చెందిన 475 మంది విద్యార్థులు, 9 మంది ఉపాధ్యాయులు ఆసుపత్రి పాలయ్యారు.

2018 మే 3

గుజరాత్​ భరూచ్​ జిల్లాలోని వ్యర్థాల రీసైక్లింగ్ కర్మాగారంలో గ్యాస్​ లీకై.. ముగ్గురు మరణించారు.

2018 జులై 3

ఉత్తర్​ప్రదేశ్​లోని ఉన్నావ్​లో ఓ కర్మాగారంలో విషవాయువు వెలువడి.. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

2018 జులై 12

ఆంధ్రప్రదేశ్​ అనంతపురం జిల్లాలోని ఉక్కు పరిశ్రమలో గ్యాస్​ లీకై.. ఆరుగురు కార్మికులు చనిపోయారు.

2018 డిసెంబర్​ 3

మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని రసాయన కర్మాగారంలో అమోనియా వాయువు వెలువడింది. ఈ ఘటనలో 14 మంది అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరారు.

2019 మే 12

మహారాష్ట్ర తారాపూర్​లోని కెమికల్​ యూనిట్​లో విషవాయువు లీకై.. సూపర్​వైజర్ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

2020 ఫిబ్రవరి 6

ఉత్తర్​ప్రదేశ్​ సీతాపూర్​ జిల్లాలోని రసాయన కర్మాగారంలో విషవాయువు పీల్చి.. ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.