ETV Bharat / bharat

ఈ నెల 14 నుంచి మద్యం 'హోమ్​ డెలివరీ'! - మద్యం హోమ్​ డెలివరీ

మద్యం అమ్మకాలను పునఃప్రారంభించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటికే లిక్కర్​ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రస్తుతం మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉండగా.. ఈ నెల 14 నుంచి ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురానునట్టు తెలుస్తోంది.

Home delivery of liquor
Home delivery of liquor allowed in Maharashtra
author img

By

Published : May 12, 2020, 7:55 PM IST

కరోనా కట్టడిలో భాగంగా మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ బుకింగ్​ చేసుకున్న మందు ప్రియులకు.. లిక్కర్​ను హోమ్​ డెలివరీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు రాష్ట్ర హోంశాఖ అనుమతులు ఇవ్వగా.. అధికారులు మార్గదర్శకాలు తయారు చేసే పనిలో పడ్డారు. ఈ నెల 14 నుంచి ఈ సర్వీసు ప్రారంభంకానుంది. ఒక్కో వ్యక్తికి 12 బాటిళ్లు కొనుక్కునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా కంటైన్​మెంట్​ జోన్లు సహా కేసులు అధికంగా ఉన్న ముంబయి, పుణె, ఔరంగాబాద్​, నాగ్​పుర్​లలో మాత్రం ఈ సర్వీసుకు అనుమతి లేదు. అంతేకాకుండా మద్యం డెలివరీ చేసే వ్యక్తి కరోనా పరీక్షలు చేయించుకోవడం, కచ్చితంగా మాస్కు ధరించడం, సానిటైజర్ వెంటపెట్టుకోవాలని సూచనలు జారీ చేయనున్నట్టు సమాచారం.

ఇప్పటికే పంజాబ్‌, బంగాల్‌ రాష్ట్రాలు మద్యాన్ని హోం డెలివరీ ఇస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.