దక్షిణ అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తమిళనాడులో రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో డిసెంబర్ 1 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలపింది.
ఈ వాయుగుండం పశ్చిమ దిశగా కదిలి డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడులోని కోస్తా ప్రాంతాన్ని తాకుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల మంగళ, బుధవారాల్లో తమిళనాడు, పుదుచ్చెరిలో కరైకల్, మహే, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ తీరం, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
తమిళనాడు, పుదుచ్చెరి, కరైకల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.