జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్, తదితరులపై ఉన్న దేశద్రోహం కేసు విచారణను దిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. ఈ లోపు కేసు విచారణకు అవసరమైన సమాచారం సేకరించాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. నిందితులపై ఆంక్షల కొనసాగింపు ప్రభుత్వ నిర్ణయం అనుసారమే ఉంటుందని స్పష్టం చేసింది.
కన్హయ్యకుమార్పై 2016లో నమోదైన దేశద్రోహం కేసులో సోమవారం దిల్లీ పోలీసులు 1200 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.
ఏం జరిగిందంటే..
పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్‌గురుకు నివాళులర్పిస్తూ 2016 ఫిబ్రవరి 9న జేఎన్‌యూ ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో కన్నయ్య కుమార్‌తోపాటు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ఖలిద్, అనిర్బన్ భట్టాచార్య భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కారణంతో వీరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.