వినాయక చవితి రోజున చిన్న చిన్న పల్లెల నుంచి పట్టణాలు గణనాథుడి పూజలతో మారుమోగుతాయి. మైకు, సౌండ్ బాక్సుల పాటలు, దూపదీప నైవేద్యాలతో సర్వం వినాయకుడి మయంగా మారుతుంది. కానీ.., ఈ ఏడాది కరోనా మహమ్మారితో ఉత్సవాలను నిరాడంబరంగా చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. శనివారం గణేశ్ చతుర్థి అయినప్పటికీ ఎక్కడా పెద్దగా ఆ హడావుడి కనిపించలేదు. చాలా వరకు ఈ ఏడాది ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. ఇళ్లల్లోనే చిన్ని గణనాథుడిని ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా దేశంలోని ప్రముఖ ఆలయాలు, ప్రధాన మండళ్ల వద్ద వేడుకలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
మహారాష్ట్రలో కనిపించన శోభ..
మహారాష్ట్రలో ఏటా అంగరంగ వైభవంగా గణేశ్ చతుర్థి వేడుకలు జరుగుతాయి. కానీ.. కరోనా వేళ ప్రస్తుతం ఆ వైభవం కనిపించటం లేదు.
గణేశ్ చతుర్థి సందర్భంగా పుణెలోని శ్రీమంత్ దగ్దుషెత్ హల్వాయి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం హారతి నిర్వహించి, ప్రార్థనలు చేశారు పూజారులు. అయితే.. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేందుకు అనుమతి లేదని తెలిపారు.
-
#WATCH Maharashtra: Morning 'aarti' and prayers being offered at Shreemant Dagdusheth Halwai Ganpati Mandir in Pune on #GaneshChaturthi, today. pic.twitter.com/G8VyOZm0IY
— ANI (@ANI) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Maharashtra: Morning 'aarti' and prayers being offered at Shreemant Dagdusheth Halwai Ganpati Mandir in Pune on #GaneshChaturthi, today. pic.twitter.com/G8VyOZm0IY
— ANI (@ANI) August 22, 2020#WATCH Maharashtra: Morning 'aarti' and prayers being offered at Shreemant Dagdusheth Halwai Ganpati Mandir in Pune on #GaneshChaturthi, today. pic.twitter.com/G8VyOZm0IY
— ANI (@ANI) August 22, 2020
నాగ్‌పుర్‌లోని శ్రీ గణేశ్ మందిర్ తెక్దిలో శనివారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక హారతి ఇచ్చి.. స్వామి వారిని ప్రార్థించారు.
-
#WATCH Maharashtra: Morning 'aarti' and prayers being offered at Shri Ganesh Mandir Tekdi in Nagpur on #GaneshChaturthi, today. pic.twitter.com/6OGQaYHg7d
— ANI (@ANI) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Maharashtra: Morning 'aarti' and prayers being offered at Shri Ganesh Mandir Tekdi in Nagpur on #GaneshChaturthi, today. pic.twitter.com/6OGQaYHg7d
— ANI (@ANI) August 22, 2020#WATCH Maharashtra: Morning 'aarti' and prayers being offered at Shri Ganesh Mandir Tekdi in Nagpur on #GaneshChaturthi, today. pic.twitter.com/6OGQaYHg7d
— ANI (@ANI) August 22, 2020
ముంబయిలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ప్రత్యేక హారతి ఇచ్చారు.
-
#WATCH Maharashtra: 'Aarti' being performed at the Shri Siddhivinayak Temple in Mumbai on #GaneshChaturthi. pic.twitter.com/5LBmeX0Ij4
— ANI (@ANI) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Maharashtra: 'Aarti' being performed at the Shri Siddhivinayak Temple in Mumbai on #GaneshChaturthi. pic.twitter.com/5LBmeX0Ij4
— ANI (@ANI) August 22, 2020#WATCH Maharashtra: 'Aarti' being performed at the Shri Siddhivinayak Temple in Mumbai on #GaneshChaturthi. pic.twitter.com/5LBmeX0Ij4
— ANI (@ANI) August 22, 2020
ప్రముఖ లాల్బాగ్చా రాజా గణపతి మండల్లో ఈ ఏడాది గణేశ్ చతుర్థి సందర్భంగా కరోనా పోరులో భాగస్వామ్యమవుతూ.. ఆరోగ్య ఉత్సవ్ నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రక్తం, ప్లాస్మా దాన శిబిరం ఏర్పాటు చేశారు. కొవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో గణేశ్ ఉత్సవాలకు బదులుగా.. ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు మండల్ అధ్యక్షుడు తెలిపారు.
ముంబయిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.
దిల్లీలో...
వినాయక చవితి సందర్భంగా కొనాట్ ప్రాంతంలోని గణేశ్ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు.
-
#WATCH Delhi: Priests offer prayers at a Ganesha Temple in Connaught Place on #GaneshChaturthi. pic.twitter.com/f4DFBcuXmF
— ANI (@ANI) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Delhi: Priests offer prayers at a Ganesha Temple in Connaught Place on #GaneshChaturthi. pic.twitter.com/f4DFBcuXmF
— ANI (@ANI) August 22, 2020#WATCH Delhi: Priests offer prayers at a Ganesha Temple in Connaught Place on #GaneshChaturthi. pic.twitter.com/f4DFBcuXmF
— ANI (@ANI) August 22, 2020
ద్వారకలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలోని మహా గణపతి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు.
గుజరాత్లో..
గణేశ్ చతుర్థి సందర్భంగా డ్రై ఫ్రూట్స్‌తో వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు సూరత్‌కు చెందిన వైద్యులు అథితి మిట్టల్. కరోనా ఆసుపత్రిలో ఏర్పాటు చేసి.. పూజలు నిర్వహించిన అనంతరం కరోనా రోగులకు ఈ పండ్లను పంచనున్నట్లు చెప్పారు.
కర్ణాటకలో..
వినాయక చవితి సందర్భంగా తన ఇంటిలో ఏర్పాటు చేసిన గణేశుడికి పూజలు నిర్వహించారు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప. బెంగళూరులోని శ్రీ సత్య గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు.
పళనిస్వామి పూజలు..
గణేశ్ చతుర్థి సందర్భంగా.. సేలంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.
గోవా సీఎం పూజలు..
కొతాంబి ప్రాంతంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.
ఇదీ చూడండి: ఉండ్రాళ్లయ్య.. ఊరడించాలయ్యా!