ETV Bharat / bharat

అంతర్జాతీయ స్థాయిలో యోగిపై కఫీల్​ ఖాన్​ పోరాటం! - United Nations Human Rights Commission

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్​పై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు గోరఖ్​పుర్​కు చెందిన డాక్టర్​ కఫీల్​ ఖాన్​. రాష్ట్రంలో, దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో జరుగుతోందని, జాతీయ భద్రత చట్టం, తీవ్రవాద నిరోధక చట్టాల వంటి వాటిని దుర్వినియోగం చేస్తున్నారని లేఖ రాశారు.

Kafeel Khan takes battle with Yogi to UN body
అంతర్జాతీయ స్థాయికి యోగిపై కఫీల్​ ఖాన్​ పోరాటం!
author img

By

Published : Sep 21, 2020, 3:56 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్​పై అంతర్జాతీయ స్థాయిలో పోరాడుతున్నారు గోరఖ్​​పుర్​కు చెందిన పిల్లల వైద్యుడు​ కఫీల్​ ఖాన్​. తనపై అక్రమంగా కేసులు పెట్టారని పేర్కొంటూ.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం(యూఎన్​హెచ్​ఆర్​సీ)కు లేఖ రాశారు. భారత్​లో అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలను ఉల్లంఘించటం, ఎన్​ఎస్​ఏ, యూఏపీఏ వంటి చట్టాలను దుర్వినియోగం చేస్తూ ప్రజాగొంతుకను అణచివేస్తున్నారని ఆరోపించారు.

పౌరచట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేస్తూ అరెస్టు అయిన కార్యకర్తల హక్కులను కాపాడాలని భారత ప్రభుత్వానికి సూచించటం పట్ల యూఎన్​హెచ్​ఆర్​సీకి కృతజ్ఞతలు తెలిపారు కఫీల్​. అయితే.. ప్రభుత్వమే తమ వినతిని పట్టించుకోవటం లేదన్నారు.

"భారత్​లోని అత్యంత పేద, అట్టడుగు ప్రజలను ప్రభావితం చేసే సమస్యలను లేవనెత్తే వారిని అణచివేసేందుకు తీవ్రవాద నిరోధక, జాతీయ భద్రతా చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నారు. జైలులో ఉన్న సమయంలో శారీరకంగా, మానసికంగా క్షోభకు గురయ్యా. చాలా రోజుల వరకు ఆహారం, మంచి నీళ్లు తీసుకోలేదు. చాలా రద్దీగా, ఇరుకుగా ఉండే మథుర జైలులో అత్యంత దయనీయంగా, అమానవీయంగా ఏడు నెలల పాటు శిక్ష అనుభవించా. అదృష్టవశాత్తు.. నాపై మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. నాపై చేపట్టిన చర్యలను చట్టవిరుద్ధమని తేల్చింది."

-డాక్టర్​ కఫీల్​ ఖాన్​

2017, ఆగస్టు 10న బాబా రాఘవ్​ దాస్​ వైద్య కళాశాలలో జరిగిన విషాద ఘటనను లేఖలో పేర్కొన్నారు కఫీల్​. ద్రవ ఆక్సీజన్​ అందుబాటులో లేకపోవటం వల్ల చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అయితే.. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు వెల్లడించిందని, ఆక్సీజన్​ టెండర్​ ప్రక్రియలో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చినట్లు లేఖలో పేర్కొన్నారు.

ఆసుపత్రి విషాదం తర్వాత ఖాన్​ను సస్పెండ్​ చేసింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. కానీ, రాష్ట్ర సర్వీస్​ల నుంచి తప్పించలేదు. ఎనిమిది రకాలుగా చేపట్టిన విచారణల్లో అతనికి సంబంధం లేదని తేలినప్పటికీ.. సస్పెన్షన్​ రద్దు చేయలేదు. ఏడు నెలల పాటు శిక్ష అనుభవించిన కఫీల్​ ఖాన్​... ప్రస్తుతం రాజస్థాన్​లోని జైపుర్​లో నివసిస్తున్నారు.

ఇదీ చూడండి: జైల్లో నన్ను క్షోభ పెట్టారు: కఫీల్​ ఖాన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.