ETV Bharat / bharat

'సామూహిక వ్యాప్తిని ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధంగా ఉండాలి' - భారత్​ కొవిడ్ మరణాల రేటు

లాక్​డౌన్ సడలించిన తర్వాత భారత్​లో కరోనా ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామూహిక వ్యాప్తి పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత్​ సిద్ధంగా ఉండాలని సూచించారు. భారత్​లో మరణాల రేటు అదుపులోనే ఉందన్నారు. గ్రామాలను కరోనా నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

community transmission
సామూహిక వ్యాప్తి
author img

By

Published : May 15, 2020, 2:00 PM IST

Updated : May 15, 2020, 3:50 PM IST

కరోనా సామూహిక వ్యాప్తిని ఎదుర్కోవడానికి భారత్​ సిద్ధంగా ఉండాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ కే శ్రీనాథ్​ రెడ్డి సూచించారు. లాక్​డౌన్ సడలించడం వల్ల మరింత వేగంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

భారత్​లో ఇప్పటికే సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని నిపుణులు చేస్తోన్న వ్యాఖ్యలపై శ్రీనాథ్ స్పందించారు. ఈ విషయం 'సామూహిక వ్యాప్తి' నిర్వచనంపై ఆధారపడి ఉంటుందన్నారు. దీనిపై వాగ్వాదం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాలు, వైరస్ సోకిన వ్యక్తులకు సంబంధం లేని కేసులు చాలా వరకు బయటపడ్డాయని తెలిపారు.

"కరోనా సోకిన చాలా మంది వైరస్ ఉన్న ప్రాంతాల వద్దే కేంద్రీకృతమై ఉన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల మార్గంతో వారికి సంబంధం ఉంది. భారత్​లో కరోనా స్టేజీ-2లో ఉందని వాదిస్తున్న వారు... సామూహికవ్యాప్తి ప్రారంభం కాలేదనే భావిస్తున్నారు. ఇది గుర్తించదగిన స్థానిక వ్యాప్తి మాత్రమే అని చెబుతున్నారు."

-ప్రొఫెసర్ శ్రీనాథ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు

అయితే వైరస్ వ్యాపించిన దాదాపు అన్ని దేశాల్లో సామూహిక వ్యాప్తి సంభవించిందని శ్రీనాథ్ గుర్తు చేశారు. అందువల్ల భారత్​ సైతం అందుకు సిద్ధంగా ఉండి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదుపులోనే మరణాలు

దక్షిణాసియా దేశాల్లో భారత్​, మలేసియా మాత్రమే కొవిడ్ మరణాల రేటును నియంత్రించగలిగాయని శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు. యువ జనాభాతో పాటు ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లోనే ఉండటం వంటి అంశాలు భారత్​లో మరణాలు పరిమితంగానే ఉండటానికి ఉపకరించాయన్నారు. వీటితో పాటు వాతావరణ పరిస్థితులు, వైరస్​ కట్టడి చేయడానికి అవలంభించిన విధానాలు ఇందుకు దోహదం చేశాయన్నారు.

లాక్​డౌన్ సడలిస్తే అంతే

లాక్​డౌన్ సడలిస్తే ఎక్కువ సంఖ్యలో ప్రజలు బయటకు వస్తారని, తద్వారా వైరస్ వ్యాప్తి అధికమయ్యే ప్రమాదం ఉందని అన్నారు శ్రీనాథ్. ఈ నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం సహా ఇతర జాగ్రత్తలు కొనసాగించాలని స్పష్టం చేశారు. మురికివాడల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు ప్రత్యేక ఆశ్రయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

గ్రామాలను కాపాడాలి

నగరాల్లో నమోదవుతున్న కేసుల్లో చాలావరకు పరిసర ప్రాంతాలకే పరిమితం కావడం కాస్త ఉపశమనం కలిగించే అంశమని పేర్కొన్నారు శ్రీనాథ్. మహమ్మారికి బలికాకుండా వలస కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

"భారత్​లోని మూడింట రెండొంతుల జనాభా గ్రామాల్లోనే ఉంది కాబట్టి వైరస్​ నుంచి గ్రామీణ ప్రాంతాలను కాపాడటం చాలా ముఖ్యం. జనసంచారం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వైరస్ వ్యాప్తి కూడా పరిమితంగానే ఉంది. లాక్​డౌన్ తర్వాత వైరస్ వ్యాప్తి ముప్పు పెరుగుతుంది. అందువల్ల సరైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి. మరో ఏడాది వరకు వైరస్ మనతోనే ఉంటుందని గ్రహించాలి. భౌతిక దూరం పాటిస్తూ క్రమక్రమంగా వైరస్​ను దూరం చేయాలి."

ప్రజారవాణాను నియంత్రించడం ద్వారా వైరస్​ను చాలా వరకు నిరోధించవచ్చని పేర్కొన్నారు శ్రీనాథ్. తద్వారా వైరస్​ తన తీవ్రత కోల్పోతుందని స్పష్టం చేశారు. జాగ్రత్త చర్యలు పాటిస్తూ వైరస్ ప్రభావాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు.

Last Updated : May 15, 2020, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.