ETV Bharat / bharat

స్విస్​ బ్యాంకు ఖాతాదారుల రెండో జాబితా విడుదల

Swiss bank
స్విస్​ బ్యాంకు
author img

By

Published : Oct 9, 2020, 4:55 PM IST

Updated : Oct 9, 2020, 5:57 PM IST

16:48 October 09

స్విస్​ బ్యాంకు ఖాతాదారుల రెండో జాబితా విడుదల

స్విస్ బ్యాంకు ఖాతాదారుల రెండో జాబితాను భారత్​కు స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందజేసింది. స్విట్జర్లాండ్‌తో స్వయంచాలక సమాచార మార్పిడి ఒప్పందం (ఏఈఓఐ) ప్రకారం పౌరులు, సంస్థల బ్యాంక్ ఖాతా వివరాలను భారత్ పొందింది.  

అయితే, ఎంతమంది ఖాతాల వివరాలు అందాయి? ఆ ఖాతాల్లో ఎంత సొమ్ముంది? అనే విషయాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.  

86 దేశాల జాబితా..

స్విస్​ బ్యాంకు ఖాతాదారుల రెండో జాబితాను మొత్తం 86 దేశాలతో పంచుకున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. 3.1 మిలియన్ల ఖాతాలకు సంబంధించిన వివరాలను ఆయా దేశాలకు వివరించినట్లు చెప్పారు. ఈ 86 దేశాల్లో భారత్​ కూడా ఉంది.  

2018 నుంచి..

ఏఈఓఐ ఒప్పందంలో భాగంగా 2019 సెప్టెంబర్​లో భారత్​ మొదటి జాబితా పొందింది. ఇందులో 100 మంది భారత పౌరులు, సంస్థల ఖాతాల వివరాలను వెల్లడించింది స్విట్జర్లాండ్.  

ఈ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్నవాటితోపాటు.. 2018 నుంచి మూసేసిన ఖాతాల వివరాలు మాత్రమే పంచుకునే వీలుంది. మరో జాబితా వచ్చే ఏడాది సెప్టెంబర్​లో విడుదల చేయనుంది.  

బలమైన ఆధారాలుగా..

అయితే, స్విట్జర్లాండ్​ ప్రభుత్వానికి అందించిన జాబితాలో అక్రమార్కులతోపాటు వ్యాపారాలు, నిజమైన అవసరాల కోసం వినియోగించే వారి వివరాలు ఉంటాయి. ఈ వివరాలతో లెక్కల్లో లేని ధనాన్ని నిగ్గుతేల్చేందుకు భారత ప్రభుత్వానికి వీలుంటుందని, అక్రమార్కులపై కేసుల్లో బలమైన ఆధారాలుగా ఇవి పనిచేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

ఇదీ చూడండి: స్విస్​బ్యాంక్​ సొమ్ముల్లో పడిపోయిన భారత్​ ర్యాంక్

Last Updated : Oct 9, 2020, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.