భారత వైమానిక దళ 88వ వార్షికోత్సవాన్ని పురస్కరించకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వాయుసేన యోధులకు శుభాకాంక్షలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లోనూ.. మానవతా సేవలోనూ భారత వాయుసేన కీలక పాత్ర పోషిస్తోందని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.
"మీరు భారత గగన తలాన్ని మాత్రమే రక్షించడం లేదు. విపత్తు సమయాల్లో.. మానవతా సేవలోనూ మీ పాత్ర ఎంతో విలువైంది. మీ ధైర్యం, పరాక్రమం, అంకితభావం.. అందరిలో స్ఫూర్తి నింపుతాయి."
-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'నాకు నమ్మకం ఉంది'
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ట్విట్టర్ వేదికగా భారత వాయుసేన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గగన యోధులకు, వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు.
"దేశ గగనతలాన్ని భారత వైమానిక దళం(ఐఏఎఫ్)..ఎల్లప్పుడూ రక్షిస్తుందనే నమ్మకం ఉంది. మీరంతా నింగిని ముద్దాడి, క్షేమంగా నేలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను."
--రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి.
ఇదీ చూడండి:'దేశీయ రక్షణ సామర్థ్యంతోనే శాంతికి పునాది'