రాజస్థాన్ భీల్వాడాలో కరోనా కలకలం రేపింది. భడదా భాగ్‌లో పెళ్లయిన వారానికే వరుడు సహా.. అతడి కుటుంబంలోని మరో 13 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పెళ్లింట్లో ఒకేసారి ఇంతమందికి వైరస్ సోకడం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది.
అప్రమత్తమైన అధికారులు.. వారందరినీ క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.
ఎక్కువ మంది గుమికూడటం వల్లే..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహ వేడుకల్లో 50 మంది కంటే ఎక్కువగా హజరుకాకూడదంటూ నిబంధనలను జారీ చేసింది రాజస్థాన్ సర్కార్. కానీ వాటిని ఉల్లంఘిస్తూ.. ఈ పెళ్లికి 60 మంది కంటే ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు.
ఇదీ చూడండి:ఇసుకలో పూరీ జగన్నాథుడి రథయాత్ర!