ETV Bharat / bharat

'రైళ్లు, విమాన సేవలపై ఆ వార్తలు నమ్మొద్దు'

లాక్​డౌన్​ అనంతరం రైళ్లు, విమాన సేవల పునరుద్ధరణపై ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​ పేర్కొన్నారు. అసత్య వార్తలను నమ్మవద్దని స్పష్టం చేశారు.

Govt to take decision on resuming train, airline services, any discussion futile: Javadekar
'రైళ్లు, విమానాలపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోలేము'
author img

By

Published : Apr 19, 2020, 2:54 PM IST

దేశంలో రైళ్లు, విమాన సేవల పునరుద్ధరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​. వీటిపై జరిగిన చర్చలు కూడా ఎలాంటి ఫలితాలు లేకుండానే ముగిశాయని స్పష్టం చేశారు.

"ఏదో ఒకరోజు రవాణా వ్యవస్థ పునరుద్ధరణ జరగాల్సిందే. అయితే అది ఏ రోజు అనేది ఇంకా తెలియదు. ఇప్పుడు వాటిపై చర్చలు జరిపినా లాభం లేదు. ఎందుకంటే పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. రోజూ కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాం."

-- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్రమంత్రి.

మే 4 నుంచి కొన్ని విమానయాన సంస్థలు దేశీయ సర్వీసులు ప్రారంభించనున్నట్టు చేసిన ప్రకటనపైనా జావడేకర్​ స్పందించారు. వారి ప్రకటనలతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ విషయంపై పౌరవిమానయాన శాఖ ఇప్పటికే స్పష్టతనిచ్చిందన్నారు. సంస్థలు తమ సొంత నిర్ణయాలు తీసుకున్నాయని వివరించారు జావడేకర్.

లాక్​డౌన్​ నేపథ్యంలో మే 3 వరకు ప్యాసింజర్​ రైళ్లు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- ఆ ఆసుపత్రిలో 21 మంది వైద్య సిబ్బందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.