ETV Bharat / bharat

కరోనాపై పోరుకు కొత్త సైన్యం- ఆన్​లైన్​లో శిక్షణ!

కరోనాపై ముందంజలో ఉండి పోరాడుతున్నారు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు. ఈ అత్యవసర సేవల విభాగంలో మరిన్ని మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది కేంద్రం. ఆన్​లైన్ విధానం ద్వారా శిక్షణ ఇచ్చి వైరస్​పై పోరుకు సన్నద్ధం చేయాలని భావిస్తోంది.

corona workers
కరోనాపై పోరుకు కొత్త సైన్యం.. ఆన్​లైన్ ద్వారా శిక్షణ!
author img

By

Published : Apr 8, 2020, 1:35 PM IST

భారత్​పై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపనుందన్న అంచనాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేస్తోంది కేంద్రం. వైరస్​పై పోరులో ముందంజలో ఉన్న ఆరోగ్య, పారిశుద్ధ్య రంగాల్లోని సిబ్బందిపై ఒత్తిడి తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఆయా విభాగాల్లో మరింత మంది ఉద్యోగులను నియమించేందుకు యత్నిస్తోంది. ఆన్​లైన్ విధానం ద్వారా వీరికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

"కరోనా వల్ల భారత్​కు ప్రమాదం పొంచి ఉంది. వైరస్​పై ముందంజలో ఉండి పోరాడుతున్న అత్యవసర సిబ్బంది వారి విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు మరిన్ని మానవ వనరులు అవసరం. దేశంలోని పలు ప్రాంతాల్లో వైరస్ విస్తరణ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం."

-సిబ్బంది శిక్షణ, వ్యవహారాల శాఖ ప్రకటన

ఐజీఓటీ ద్వారా...

కరోనాపై పోరుకు నియమించే ఈ ఉద్యోగులకు ఆన్​లైన్ ద్వారా శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది కేంద్రం. వీరిని సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వ సమగ్ర ఆన్​లైన్ శిక్షణ(ఐజీఓటీ) విధానాన్ని ప్రవేశపెట్టనుంది. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, సాంకేతిక నిపుణులు, ఏఎన్​ఎంలు వంటి సేవల కోసం ఆన్​లైన్ విధానం ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి: 'తేలికపాటి లక్షణాలు ఉంటే ఇంటివద్దే ఇలా చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.