ETV Bharat / bharat

'ఆర్బీఐ నియమాలను అతిక్రమించి ఎన్నికల బాండ్లు' - congress criticize on electoral bonds

ఎన్నికల బాండ్ల అంశాన్ని పూర్తిగా మోసపూరితమైన చర్యగా కాంగ్రెస్ ఆరోపించింది​. ఆర్బీఐ నియమాలను అతిక్రమించి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందిని విమర్శించింది. భాజపా ఖజానాలోకి నల్లధనం చేర్చేందుకే బాండ్లను తీసుకొచ్చారని.. జవాబుదారీ లేని బాండ్లను కాంగ్రెస్​ పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేసింది. ఈ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్​ చేసింది.

'ఆర్బీఐ నియమాలను అతిక్రమించి ఎన్నికల బాండ్లు'
author img

By

Published : Nov 18, 2019, 11:38 PM IST

రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఆర్బీఐ) నియమాలను అతిక్రమించి ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించింది కాంగ్రెస్​. ఇది నల్లధనాన్ని భాజపా ఖజానాలోకి చేర్చేందుకేనని.. ఎన్నికల బాండ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్​ చేసింది. ఎన్నికల బాండ్ల ప్రక్రియ పూర్తిగా అపారదర్శకమని, మనీ లాండరింగ్​ను ప్రోత్సహించడమేని ఆరోపించింది కాంగ్రెస్​​. బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్​ చేసింది. ఈ పథకం వెనక ఉన్న 'క్విడ్​ ప్రో కో'( నీకు ఇది నాకు అది) ఏమిటో తెలపాలని కోరింది.

లంచానికి మారుపేరుగా..

ఎన్నికల బాండ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. సరికొత్త భారత్​లో లంచాలు, అక్రమ కమీషన్స్​కు మారుపేరే ఎన్నికల బాండ్లు అని దుయ్యబట్టారు.

electoral bonds
రాహుల్​ గాంధీ ట్వీట్​

భాజపా పెట్టెల్లోకి నల్లధనం...

ఎన్నికల బాండ్ల అంశంలో కేంద్రపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. భాజపా ట్రంక్​ పెట్టెల్లోకి నల్లధనం చేర్చేందుకు వీలుగా ఎన్నికల బాండ్లను తీసుకొచ్చారని ఆరోపించారు. ఆర్బీఐ నియమాలను అతిక్రమించి, జాతీయ భద్రతా సమస్యలను తోసిపుచ్చి ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టారన్నారు. నల్లధనం అరికడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు అదే అక్రమ సొమ్మును తమ ఖజానాలోకి నింపుకోవాలని చూస్తున్నారని ట్వీట్​ చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపించారు.

electoral bonds
ప్రియాంక గాంధీ ట్వీట్​

ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేయాలి..

ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని అభిప్రాయం కోరినప్పటికీ.. కేంద్ర బ్యాంకు అభ్యంతరాలు, సలహాలను తోసిపుచ్చిందన్నారు కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్​ గౌడ​. ఎన్నికల బాండ్లు పూర్తి మోసపూరితమైన చర్యగా అభివర్ణించారు. రాజ్యసభలో మార్పులు చేయలేని విధంగా ఈ పథకాన్ని మనీ బిల్లుగా తీసుకువచ్చారని ఆరోపించారు. జవాబుదారీ లేని బాండ్లను కాంగ్రెస్​ పూర్తిగా వ్యతిరేకిస్తోందని.. ఈ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

పార్లమెంట్​ సమావేశాల్లో ఎన్నికల బాండ్ల విషయంపై లేవనెత్తతామని స్పష్టం చేశారు కాంగ్రెస్​ ప్రతినిధి రాజీవ్​ గౌడ.

95 శాతం భాజపాలోకే..

2018, మార్చి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.6 వేల కోట్ల ఎన్నికల బాండ్లు అమ్ముడవుతే అందులో 95 శాతం భాజపా ఖజానాలోకే వెళ్లాయని ఆరోపించింది కాంగ్రెస్​. కాంగ్రెస్​ పార్టీ రూ.500 కోట్ల బాండ్లు మాత్రమే స్వీకరించిందని... మిగతా బాండ్లు భాజపాలోకే వెళ్లాయని పేర్కొంది.

ఇదీ చూడండి: సైనిక తరహా దుస్తుల్లో రాజ్యసభ మార్షల్స్​!

New Delhi, Nov 16 (ANI): Singer Taylor Swift surprised fans with new music from the upcoming musical fantasy drama 'Cats' ahead of its release date. On Friday at midnight, the 29-year singer released her new original song, 'Beautiful Ghosts', from the upcoming Tom Hooper directorial Tony-winning musical, reported People magazine.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.