దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్డౌన్ 2.0కు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. మే 3 వరకు రైళ్లు, విమాన సేవలు, సినిమా హాళ్లు, బార్లు తదితర వాటిపై ఉన్న నిషేధాన్ని కొనసాగించింది.
అయితే లాక్డౌన్ వల్ల ప్రజలు పడే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రత్యేక కార్యకలాపాలకు అనుమతినిచ్చింది కేంద్రం. వీటి అమలుకు ముందే కేంద్రపాలిత, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కార్యాలయాలు, ఫ్యాక్టరీలు తదితర ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలని నిర్దేశించింది.
ఈసారి హాట్స్పాట్ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కేంద్రం. నిత్యావసరాలు మినహా ఎలాంటి కార్యకలాపాలు సాగకుండా చూడాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు సూచించింది. కేంద్ర మార్గదర్శకాలతో పాటు వైరస్ కట్టడికి అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు చేపట్టవచ్చని ఆయా ప్రభుత్వాలకు సిఫార్సు చేసింది. అయితే ఏప్రిల్ 20 అనంతరం సాగే ప్రత్యేక కార్యకలాపాలేవీ హాట్స్పాట్ ప్రాంతాల్లో అమలు కావు.
మార్గదర్శకాలివే...
ఇదీ చూడండి:- భారత గబ్బిలాల్లో కరోనా వైరస్