ETV Bharat / bharat

కరోనా రోగి మృతిపై ఆగ్రహం- అంబులెన్స్​కు నిప్పు - కర్ణాటక బెల్​గావీ ఘటన

కరోనా సోకి ఓ వ్యక్తి మృతి చెందగా.. అతని మరణానికి వైద్యులే కారణమని ఆసుపత్రి ఆంబులెన్స్​కు నిప్పంటించారు బాధిత కుటుంబ సభ్యులు. కర్ణాటక బెళగావిలో ఈ ఘటన జరిగింది.

Fire to Ambulance by corona patient relatives in Belagavi
కరోనాతో బాధితుడు మృతి.. అంబులెన్స్​కు నిప్పంటించిన బంధువులు
author img

By

Published : Jul 23, 2020, 11:09 AM IST

కర్ణాటక బెళగావిలో కరోనా మృతుడి బంధువులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రోగి మృతికి వైద్యులే కారణమని ఆరోపిస్తూ బెళగావి సిటీ ఆసుపత్రి అంబులెన్స్‌ను తగలబెట్టారు. ఆసుపత్రి అద్దాలపై రాళ్లు విసిరారు. వైద్యశాల ప్రాంగణంలో నిలిపి ఉంచిన ప్రైవేట్‌ వాహనాలను ధ్వంసం చేశారు.

బెళగావి సిటీ క్యాంప్ ‌ఏరియాకు చెందిన ఓ వ్యక్తి జూన్‌ 19న కరోనా వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు.

అంబులెన్స్​కు నిప్పంటించిన బాధితుడి బంధువులు

దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు ఆసుపత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి అంబులెన్స్‌కు నిప్పుపెట్టారు. సమాచారం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.