దిల్లీ గ్రేటర్ పరిధిలోని నోయిడాలో అగ్నిప్రమాదం సంభవించింది. యమహా ఆటోమొబైల్ కంపెనీ గోదాంలో ఈ ఘటన జరిగింది. అయితే సిబ్బంది అప్రమత్తతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులు వెల్లడించారు.
"సూరజ్పుర్ ప్రాంతంలోని యమహా ఆటోమొబైల్ విడిభాగాల గోదాంలో మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు."
-పోలీసు అధికారులు
బుధవారం ఉదయం 5గంటల సమయంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు.
ఇదీ చూడండి: దేశంలో ఒక్కరోజులో 2003 కరోనా మరణాలు