భాజపాకు అనుకూలంగా ప్రచారం చేస్తోందని ఓ శునకాన్ని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. నందూర్బార్ పట్టణంలో ఒంటిపై భాజపా స్టిక్కర్లతో వీధుల్లో తన యజమానితో కలిసి తిరుగుతోంది ఓ కుక్క. అయితే పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రచారం నేరమని పోలీసులు ఆ శునకాన్ని అదుపులోకి తీసుకున్నారు.
నవనాథ్ నగర్ ప్రాంత నివాసి ఏక్నాథ్ మోతిరాం చౌదరి... ఈ శునకం యజమాని. తన పెంపుడు కుక్క శరీరంపై "మోదీకి ఓటెయ్యండి.. దేశాన్ని కాపాడండి" అనే నినాదం ఉన్న స్టిక్కర్ అంటించారు.
పోలింగ్ సమయంలో ప్రచారాన్ని నేరంగా పరిగణించి యజమాని సహా కుక్కపైనా ఐపీసీ 171(ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. కుక్కను కస్టడీలోకి తీసుకోవాలని స్థానిక మునిసిపాలిటీని ఆదేశించారు.
ఇదీ చూడండి: గంభీర్ ప్రచారాన్ని నిషేధించండి: ఆప్