ETV Bharat / bharat

కన్హయ్య కేసు విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా

కన్హయ్యకుమార్​ తదితరులపై ఉన్న దేశద్రోహం కేసు విచారణను దిల్లీ పాటియాలా హౌజ్​కోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.

పాటియాలా హౌజ్​కోర్టు
author img

By

Published : Feb 6, 2019, 1:45 PM IST

జేఎన్​యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్, తదితరులపై ఉన్న​ దేశద్రోహం కేసు విచారణను దిల్లీ పాటియాలా హౌస్​ కోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. ఈ లోపు కేసు విచారణకు అవసరమైన సమాచారం సేకరించాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. నిందితులపై ఆంక్షల కొనసాగింపు ప్రభుత్వ నిర్ణయం అనుసారమే ఉంటుందని స్పష్టం చేసింది.

జవహర్​లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్​ మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్​పై 2016లో నమోదైన దేశద్రోహం కేసు విషయంలో దిల్లీ పోలీసులు 1200 పేజీల ఛార్జ్​షీట్​ దాఖలు నమోదు చేశారు. దీనిని సోమవారం దిల్లీలోని పాటియాలా హౌజ్​ కోర్టులో దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.

ఏం జరిగిందంటే..

పార్లమెంట్​పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్​గురుకు నివాళులర్పిస్తూ 2016, ఫిబ్రవరి 9న జేఎన్​యూ ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో కన్హయ్యకుమార్​తోపాటు జేఎన్​యూ విద్యార్థులు ఉమర్​ఖలిద్​, అనిర్బన్​ భట్టాచార్య భారత్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కారణంతో వీరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.