ETV Bharat / bharat

కోవాగ్జిన్‌ తుది దశ పరీక్షలకు డీసీజీఐ అనుమతి

భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవిడ్​-19 వ్యాక్సిన్​ కోవాగ్జిన్​ మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​కు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసింది. రెండో దశలోని భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటా ఆధారంగా తగిన మోతాదులో మూడో దశ అధ్యయనాన్ని ప్రారంభించాలని సూచించింది డీసీజీఐలోని నిపుణలు కమిటీ. ఈ మేరకు త్వరలోనే ఫేజ్​-3 ట్రయల్స్​ ప్రారంభం కానున్నాయి.

covaxin
కోవాగ్జిన్‌ తుది దశ పరీక్షలకు డీసీజీఐ అనుమతి
author img

By

Published : Oct 10, 2020, 5:40 AM IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్​ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. దేశీయ ఫార్మా దిగ్గజం భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవిడ్​-19 వ్యాక్సిన్​ క్యాండిడెట్ కోవాగ్జిన్​​ మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​కు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)అనుమతులు ఇచ్చింది.

మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​ ప్రోటోకాల్​తో పాటు తొలి, రెండో దశ ట్రయల్స్​ తాత్కాలిక సమాచారాన్ని డీసీజీఐ నిపుణుల కమిటీ (ఎస్​ఈసీ) ముందు భారత్​ బయోటెక్​ ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. తొలి రెండు దశల ట్రయల్స్​ సమాచారాన్ని కమిటీ పరిశీలించినట్లు తెలిపారు. వివరణాత్మక చర్చల తర్వాత, మూడవ దశ అధ్యయనం రూపకల్పన సూత్రప్రాయంగా సంతృప్తికరంగా ఉందని కమిటీ అభిప్రాయపడిందన్నారు.

భారత్​ బయోటెక్​ కొవిడ్​ వ్యాక్సిన్​ (బీబీవీ152)పై ప్రస్తుతం క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహిస్తోంది. రెండో దశలోని భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటా ఆధారంగా తగిన మోతాదులో మూడో దశ అధ్యయనాన్ని ప్రారంభించాలని ఎస్​ఈసీ తెలిపింది. అలాగే రెండో దశ సమాచారాన్ని సమర్పించాలని సూచించింది.

అలాగే.. కాడిలా ఫార్మాస్యూటికల్​ రూపొందించిన మైకోబాక్ట్రియం డబ్ల్యూ (ఇమ్యునోమోడ్యులేటర్​) మూడవ దశ క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేయాలని కమిటీ సిఫారసు చేసింది.

ఇదీ చూడండి: గుడ్ న్యూస్: నవంబరులో కోవాగ్జిన్‌ తుది దశ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.