భారత్‌లో ఇవాళ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మహారాష్ట్రలో మంగళవారం 7,760 మందికి వైరస్ సోకింది. మరో 300 మరణాలు సంభవించాయి.
తమిళనాడులో కొత్తగా 5,063 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2,68,285కు పెరిగింది. మృతుల సంఖ్య 4,349కి ఎగబాకింది. ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రంగా విస్తరిస్తోంది.
లక్షకు పైగా కొవిడ్ బాధితులు
ఉత్తర్‌ప్రదేశ్‌లో కొవిడ్ బాధితుల సంఖ్య లక్ష మార్కును దాటింది. కొత్తగా 2,948 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 41 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 1,00,310కు పెరగగా... మృతుల సంఖ్య 1817కు చేరింది. 57వేల మందికిపైగా కొవిడ్ నుంచి బయటపడ్డారు.
కేరళ..
కేరళలో తాజాగా 1,083 మంది వైరస్ బారిన పడ్డారు. మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,950కు చేరగా... మరణాల సంఖ్య 87కు పెరిగింది.
ఒక్కరోజులో తక్కువ మరణాలు..
దిల్లీలో కొత్తగా 674 మందికి వైరస్ సోకింది. మరో 12 మంది చనిపోయారు. ఒక్కరోజులో నమోదైన మరణాల్లో ఇదే అత్యల్పమని అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 1,39,156కు చేరింది. ఇప్పటివరకు 4,033 మంది మరణించారు.
ఇదీ చూడండి: రామ్‌లల్లా వస్త్రాలంకణ బాధ్యత లాల్ కుటుంబానిదే!